Wednesday, August 30, 2017

Beginners guide to Upanishads


What is the meaning of the word 'Úpanishad'?

The Upanishads are the the 'Gnanakanda'- the 'wisdom section' of  the four Vedas: Rig, Yajur, Sama and Atharva. Each of the vedas are divided into 3 portions - the Samhitas (the vedic hymns), the Brahmanas (ritualistic ceremonies and procedures), Aranyakas (forest hymns) and Upanishads (vedanta). The first two portions are collectively known as karma kanda whereas Aranyakas and Upanishads form the gnana kanda.

The Upanishads are called Vedanta because they come at 'the end of the Vedas'. This is the literary meaning. The philosophical meaning is that, if you have studied Upanishads, it is equal to completing the study of all Vedas.

What does the word 'Upanishad' mean? The word has been divided into 3 parts - upa, ni, shad. Let us see the literal and philosophical meaning of these words.

Upa:  means 'to go closer, to move closer, to move nearer to' the teacher. philosophically it means 'to move nearer to the truth'.

Shad: it indicates 'to sit'. It means sitting down with the keen intention of listening and learning.

Ni: This connects Upa and Shad and points to the level of sitting. It meas sitting at a level lower to that of a teacher. It also indicates the requirement of humility to learn.

So let's put the three things together; then the word 'Úpanishad' means that the teacher and the student sit together with the student exhibiting a keen desire to learn with humility. 



ఉపనిషత్తులు అనగా నేమి? 

ఉపనిషత్తులు వేద విభాగం లో జ్ఞాన కాండ గా గణిస్తారు. నాలుగు వేదములు అయినటువంటి ఋగ్, యజుర్, సామ మరియు అథర్వ వేదములు ప్రతి యొకటి మూడు భాగములు కలిగి ఉన్నవి. అవి సంహిత (వేదం మంత్రాలూ) , బ్రాహ్మణములు (యజ్ఞ యాగాది క్రతువుల విధి విధానం), ఆరణ్యకములు మరియు ఉపనిషత్తులు( ఇవి వేదాంతమునకు సంబంధించినవి).

ఉపనిషత్తులకు మరియొక పేరు - వేదాంతం. దీనికి రెండు కారణాలు. ఒకటి ఇవి వేదమునకు చివరగా లేక అంతమునందు ఉంటాయి కనుక వేదాంతం అని పేరు. మరియొక కారణం; ఇవి వేద సారం అంతా తమలో కలిగి వుంటాయి కనుక, ఇవి చదివితే ఇక వేదమంతా చదివినట్లే అవుతుంది కనుక వేదాంతం అని కూడా అంటారు. 

ఇక ఉపనిషత్ అనే పదములో మూడు భాగాలు ఉంటాయి. అవి: ' ఉప' , ' ని' , 'షత్' . ఇప్పుడు వీటికి గల సామాన్య మరియు తాత్విక అర్థాలు చూద్దాము.

'ఉప' : అనగా దగ్గరగా , లేక సమీపముగా ఉండుట. ఎవరికీ సమీపము అనగా , ఆచార్యునికి సమీపము గా ఉండుట అనేది సామాన్య అర్థం అయితే, సత్యము లేక పరమార్థ చింతనకు దగ్గరగా ఉండుట అనేది తాత్విక అర్థము. 

'షత్'  అనగా కూర్చునుట. కూర్చోవటానికి పరమార్థం ఏమిటంటే తత్త్వ విచారణ, జ్ఞాన సముపార్జన చెయ్యాలనే ఆశక్తి, కుతూహలం, దృడ సంకల్పం ఉండటం అని చెప్పవచ్చు. 

ఇక 'ని' అనగా ఆచార్యుని స్థానం కంటే కొంచెము దిగువగా కూర్చునుట. ఆచార్యుని విద్వత్ పైన గౌరవం తో అయన ఆసనానికి దిగువగా కూర్చునుట.

ఇప్పుడు మొత్తం ఉపనిషత్ అనే పదానికి అర్థం తీసుకుంటే, జ్ఞాన సముపార్జన అనే దృడ సంకల్పంతో, ఆచార్యుని సమీపములో, దిగువ ఆసనం మీద కూర్చుని విద్యను నేర్చుకొనుట.

మళ్ళీ కలుద్దాం!