Wednesday, October 4, 2017

శ్రీ లలితా పరమేశ్వరి మంత్రిణులు, సేనానులు!

శ్రీ లలితా పరమేశ్వరి మంత్రిణులు: 

అమ్మవారి మంత్రిణులు 16 మంది ఉంటారు. వారి పేర్లు;

1. సంగీత యోని
2. శ్యామా
3. శ్యామలా
4. మంత్రనాయికా
5. మంత్రిణీ
6. సచివేశానీ
7. ప్రధానేశ
8. కుశప్రియా
9. వీణావతీ
10. వైణికీ
11. మద్రిణీ
12. ప్రియకప్రియా
13. నీపప్రియా
14. కదంబవేశ్యా
15. కదంబ వనవాసినీ
16. సదామలా

వీరిలో 'శ్యామలా' ముఖ్యురాలు.

అమ్మవారి సేనానులు: 

అమ్మవారికి 12 మంది సేనానులు ఉంటారు. వారి పేర్లు:

1. పంచమీ
2. దండనాధా
3. సంకేతా
4. సమయేశ్వరీ
5. సమయసంకేతా
6. వారాహీ
7. పోత్రిణీ
8. శివా
9. వార్తాళీ
10. మహాసేనానీ
11. ఆజ్ఞాచక్రేశ్వరీ
12. అలిందినీ

వీరిలో 'వారాహీ'  ముఖ్యురాలు.

***

Monday, October 2, 2017

శ్రీ చక్రం - నవమ ఆవరణం - బిందు మండలం: The Ninth Precinct!

శ్రీ చక్రం - నవమ ఆవరణం - బిందు మండలం:

ఇది శ్రీ చక్ర కేంద్రం వద్ద బిందు పరిమాణంలో ఉంటుంది. ఈ ఆవరణలో పదహారు నిత్యా దేవతలు ఉంటారు. వీరందరూ లలితాదేవి తో సమానమైన తేజస్సు, పరాక్రమం తో ఉంటారు. వీళ్ళందరూ కాల రూపులు, విశ్వమంతా వ్యాపించి వుంటారు.  నిత్యాదేవతల పేర్లు;

1. కామేశ్వరీ
2. భగమాలినీ
3. నిత్యక్లిన్నా
4. భేరుండా
5. వహ్నివాసినీ
6. మహావజ్రేశ్వరీ
7. శివదూతీ
8. త్వరితా
9. కులసుందరీ
10. నిత్యా
11. నీలపతాకా 
12. విజయా
13. సర్వమంగాళా
14. జ్వాలామాలినీ
15. చిత్రా
16. మహా నిత్యా

బిందు మండలం చేరిన సాధకుడు అమ్మవారి సన్నిధి చేరినట్లే!


****శుభం భూయాత్ ***

శ్రీ చక్రం - ఎనిమిదవ ఆవరణ : త్రికోణం: The Eighth Precinct!

శ్రీ చక్రం - ఎనిమిదవ ఆవరణ : త్రికోణం:

శ్రీ చక్రం లో ఎనిమిదవ ఆవరణ మూడు కోణాలు కలిగిన త్రిభుజాకారం లో ఉంటుంది. 

ఈ ఆవరణలో ముగ్గురు 'అతి రహస్య శక్తులు' పటం లో చూపించిన వరుస క్రమంలో ఉంటారు. వీరికి ఒకొక్కరికీ ఎనిమిది చేతులు ఉంటాయి. వాటిలో వరుసగా, బాణం, చాపం, పాన పాత్ర, మాతులుంగ , ఖడ్గం, డాలు, నాగపాశం, ఘంటాయుధం ధరించి వుంటారు. వీరి పేర్లు;

కామేశ్వరీ 
భగమాలినీ
వజ్రేశ్వరీ

సాధకుని తరువాత గమ్యం బిందు మండలం .

శ్రీ చక్రం - సప్తమావరణం - వసుకోణం: The Seventh Precinct!

శ్రీ చక్రం - సప్తమావరణం - వసుకోణం:

శ్రీ చక్రం లో ఏడవ ఆవరణ ఈ క్రింది పటంలో చూపిన విధంగా 8 కోణాలు కలిగిన ఆకారం లో ఉంటుంది. 


ఈ ఆవరణలో ఎనిమిదిమంది 'వాగ్దేవతలు'  ఉంటారు. వీరు రక్తాశోక కాంతి గల శరీర కాంతిలో ఉంటారు. ఒకొక్కరికీ  నాలుగు చేతులు ఉంటాయి. వాటిలో బాణం, విల్లు, వీణ, పుస్తకం ధరించి ఉంటారు. వీరి పేర్లు;

1. వశినీ 
2. కామేశ్వరీ
3. మోదినీ
4. విమలా
5. అరుణా
6. జయినీ
7. సర్వేశ్వరీ
8. కౌళినీ

వాగ్దేవతల అనుగ్రహాన్ని సాధించి సాధకుడు ముందుకు వెళతాడు. 

***

శ్రీ చక్రం - ఆరవ ఆవరణ - అంతర్దశారం: The Sixth Precinct!

శ్రీ చక్రం - ఆరవ ఆవరణ - అంతర్దశారం:

శ్రీ చక్రం ఆరవ ఆవరణ ఈ క్రింది పటంలో చూపిన విధంగా 10 కోణాలు కలిగిన ఆకారం లో ఉంటుంది. 




ఈ ఆవరణలో 10 మంది 'నిగర్భ యోగినులు' ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. నాలుగు చేతులలోనూ వజ్రము, శక్తి, తామరం, చక్రం ధరించి ఉంటారు.  వీరి పేర్లు;

1. సర్వజ్ఞా
2. సర్వ శక్తి
3. సర్వ ఐశ్వర్య ప్రద
4. సర్వ జ్ఞానమయీ
5. సర్వ వ్యాధి వినాశిని
6. సర్వాధార స్వరూపా
7. సర్వపాపహరా
8. సర్వానందమయీ
9. సర్వ రక్షాస్వరూపిణీ
10. సర్వేప్సితార్ధప్రదా

సాధకుడు ఈ ఆవరణలో ఈ యోగ శక్తులను ప్రాప్తిన్చుకుని సాధనలో ముందుకు సాగుతాడు. 

***


Sunday, October 1, 2017

శ్రీ చక్రం - ఐదవ ఆవరణ - బహిర్దశారం : The Fifth Precinct!

శ్రీ చక్రం - ఐదవ ఆవరణ - బహిర్దశారం:

ఈ ఆవరణ ఈ క్రింది పటంలో చూపిన విధంగా 10 కోణాలు కలిగిన ఆకారంలో ఉంటుంది: 




ఈ ఆవరణలో పది 'శక్తులు' పటంలో చూపిన వరుస క్రమంలో ఉంటారు. స్ఫటిక మణి కాంతి కలిగిన శరీర కాంతి తో ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. వాటిలో వరుసగా పరశువు, పాశము, గద, ఘంటామణి ధరించి ఉంటారు. ఈ పదిమంది శక్తుల పేర్లు ఇవి; 

1. సర్వ సిద్ధిప్రద
2. సర్వ సంపత్ప్రద
3. సర్వ ప్రియంకరీ
4. సర్వ మంగళకారిణీ
5. సర్వ కామప్రద
6. సర్వ దుఃఖవిమోచినీ
7. సర్వ మృత్యుప్రశమనీ
8. సర్వ  విఘ్ననివారిణీ
9. సర్వాంగ సుందరీ
10.సర్వ సౌభాగ్యదాయినీ

సాధకుడు ఈ ఆవరణలో ఈ శక్తులను  ప్రాప్తించుకుని, సాధనలో ముందుకు సాగుతాడు. 

***