Saturday, September 30, 2017

శ్రీ చక్రం - నాలుగవ ఆవరణ - మన్వస్రం: The Fourth Precinct!

శ్రీ చక్రం - నాలుగవ ఆవరణ - మన్వస్రం:

శ్రీ చక్రం లోని నాలుగవ ఆవరణ ఈ క్రింది పటం లో చూపిన విధంగా 14 కోణాలు కలిగిన ఆకారంతో ఉంటుంది. ఇక్కడ 'సంప్రదాయ యోగినిలు' 14 మంది పటం లో సూచించిన సంఖ్యల క్రమం లో ఉంటారు. 



వీరు కాలానల శరీర కాంతి తో ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. వాటిలో వహ్ని చాపం, వహ్ని బాణం,  వహ్ని రూప ఖడ్గం,  వహ్ని రూప చక్రం ధరించి ఉంటారు. వీరి పేర్లు;

1. సర్వ సంక్షోభిణీ
2. సర్వ విద్రావణీ
3. సర్వ ఆకర్షిణీ
4. సర్వ ఆహ్లాదినీ
5. సర్వ సమ్మోహినీ
6. సర్వ స్తంభినీ
7. సర్వ జ్రుమ్భిణీ
8. సర్వ వశంకరీ
9. సర్వ రంజనీ
10.సర్వోన్మాదినీ
11.సర్వార్ధ సాధినీ
12. సర్వ సంపత్తి పూరిణీ
13. సర్వ మంత్రమయీ
14. సర్వ ద్వంద్వక్షయంకరీ

ఈ ఆవరణలో సాధకుడు ఈ యోగినీ శక్తులను ప్రాప్తించుకుని తన సాధనలో ముందుకు సాగుతాడు.

*** 

Friday, September 29, 2017

శ్రీ చక్రం - తృతీయ ఆవరణం - అష్ట దళ పద్మం: The Third Precinct!

శ్రీ చక్రం - తృతీయ ఆవరణం - అష్ట దళ పద్మం:

శ్రీ చక్రంలోని మూడవ ఆవరణం 8 దళాల పద్మాకారంలో ఈ క్రింది చూపిన విధంగా ఉంటుంది. 




ఆ మూడవ ఆవరణలో 8 మంది 'గుప్తతర దేవతలు' ఉంటారు. మందార పువ్వు రంగు దేహకాంతి తో ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. చెరుకు విల్లు, పుష్ప శరం, పుష్ప గుచ్చం, ఉత్పలం ధరించి ఉంటారు.  వీరి పేర్లు వరుసగా; 

1. అనంగ కుసుమ
2. అనంగ మేఖల
3. అనంగ మదన
4. అనంగ మదనాతుర
5. అనంగ రేఖా
6. అనంగ వేగినీ
7. అనంగాంకుశ
8. అనంగ మాలినీ

సాధకుడు ఈ ఆవరణ ప్రవేశించి మరింత ముందుకు వెళతాడు. 

****

శ్రీ చక్రం - రెండవ ఆవరణ - షోడశ దళ పద్మం : The Second precinct!

శ్రీ  చక్రం - రెండవ ఆవరణ - షోడశ దళ పద్మం :

ఇది 16 దళాల పద్మాకారం లో ఉంటుంది. ఈ క్రింది పటం లో చూడవచ్చు. 



ఈ ఆవరణలో 16 మంది గుప్త దేవతలు పైన చూపిన సంఖ్యల క్రమంలో ఉంటారు. ఒకొక్కరికి నాలుగు చేతులు ఉంటాయి. మూడు నేత్రాలు ఉంటాయి. చంద్ర వంక ను ధరించి ఉంటారు. ధనుస్సు , బాణం, డాలు, ఖడ్గం ఆయుధాలుగా దరించి ఉంటారు. వారి పేర్లు వరుసగా; 

1. కామాకర్షిణీ  (మనసు) (Conscious mind)
2. బుద్హ్యాకర్షిణీ (బుద్ధి) (Intellect)
3. అహంకారాకర్షిణీ (అహంకారం) (I or Ego)

(పంచ తన్మాత్రలు) (The 5 Sensory Perceptions of Ears, Skin, Eyes, Tongue, Nose)

4. శబ్దాకర్షిణీ  (Hearing)
5. స్పర్శాకర్షిణీ (Touch)
6. రూపాకర్షిణీ (Seeing)
7. రసాకర్షిణీ   (Taste)
8. గంధాకర్షిణీ  (Smell)

9. చిత్తాకర్షిణీ  (Sub-conscious mind)
10. ధైర్యాకర్షిణీ
11. స్మృత్యా కర్షిణీ
12. నామాకర్షిణీ
13. బీజాకర్షిణీ
14. ఆత్మాకర్షిణీ
15. అమృతాకర్షిణీ
16. శరీరాకర్షిణీ

ఈ రెండవ ఆవరణ లోకి ప్రవేశించిన సాధకునకు అమ్మవారి అనుగ్రహం వలన ఈ ఆకర్షణ శక్తుల పట్ల సంయమనం లభిస్తుంది.

ఈ ఉన్నతి ని సాధించి శ్రీ విద్యోపాసకుడు మరింత ముందుకు సాగుతాడు. 


***


Thursday, September 28, 2017

శ్రీ చక్రం - మొదటి ఆవరణ : The First Precinct


మొదటి ఆవరణం - ధరణీ సదనం (భూపురం)

శ్రీ చక్రానికి వెలుపల నాలుగు వైపులా గోడలాగా ఉండే దాన్ని భూపురం అంటారు. అది ఈ క్రింది విధం గా ఉంటుంది:


ఈ ప్రధమ ఆవరణలో అణిమాది దేవతలు 28 మంది ఉంటారు. వీరందరూ మందార పువ్వు రంగు గల దేహచ్చాయ తో ఉంటారు. ఒక్కొక్కరికి నాలుగు చేతులు ఉంటాయి. వాటిలో చింతామణి, కపాలం, త్రిశూలం, అంజనం లేదా కాటుక ఆయుధాలుగా ధరించి వుంటారు.  ఆ 28 దేవతల పేర్లు క్రింద ఇవ్వబడ్డాయి:

అష్ట సిద్దులు: 
1. అణిమా  
2. మహిమా
3. గరిమ
4. లఘిమా 
5. ప్రాప్తి
6. ప్రాకామ్య 
7. ఈశిత్వ 
8. వశిత్వ 

9. ఇచ్ఛా   
10. సర్వకామ 

సప్త మాతృకలు: 
11. బ్రాహ్మి 
12. మాహేశ్వరి 
13. కౌమారి 
14.  వైష్ణవి, 
15. వారాహి 
16. మహేన్ద్రి 
17. చాముండా 

18. మహాలక్ష్మి 

19. సర్వసంక్షోభిని 
20. సర్వ విద్రావిణీ 
21. సర్వాకర్షణీ
22. సర్వవశంకరీ 
23. సర్వోన్మాదినీ 
24. సర్వ మహంకుశా 
25. సర్వ ఖేచరీ 
26. సర్వ బీజా
27. సర్వ యోని 
28. సర్వ త్రిఖండా

శ్రీ విద్య ఉపాసకుడు సాధించే మొదటి మెట్టు ప్రధమ ఆవరణ. ఈ ఆవరణలో అష్ట సిద్ధులు, సప్త మాతృకలు, మరి ఎన్నో ఇతర శక్తులు ఉన్నాయి. ఈ ఆవరణ సాధించినవారికి వీరి అనుగ్రహం కలుగుతుంది. 

సాధకుడు ముందుకు వెళ్లి రెండవ ఆవరణ ప్రవేశిస్తాడు.

****

Wednesday, September 27, 2017

శ్రీ చక్రం - నిర్మాణము, ఆవరణలు, అధిదేవతలు - Sri Chakra - A powerful geometrical model symbolizing the Divine Mother

మనం సాధారణంగా శివాలయాలు లేక శక్తి ఆలయాలు దర్శించినప్పుడు, శ్రీ చక్ర అర్చన చేయించటం కద్దు. శ్రీ చక్రం అంటే అమ్మవారి ప్రతీక అని మాత్రమే మనలో చాలామందికి సాధారణం గా తోచే విషయం. అ విశ్వాసం మరియు నమ్మకం తో మనం ఆర్చన చేసుకుంటాం. 
కానీ లోతుగా పరిశీలించే సాధకులకు, జిజ్ఞాసువులకు శ్రీ చక్ర నిర్మాణం, అందులోని ఆవరణలు, అధిదేవతలు గురించి తెలియటమే కాక అందులోని కేంద్ర బిందుమండల స్థానంలో తేజోమయ రూపంలో విరాజిల్లే అమ్మవారిని ఉపాసిస్తారు. 

ఇప్పుడు మనవంటి వారికోసం, నేను చదివిన మరియు విన్న విషయాల ఆధారంగా, ఈ విషయం గురించి మన పరిధిలో ఈ వ్యాస పరంపరలో మీ ముందు ఉంచుతాను. విషయాన్ని అర్థం చేసుకున్న తరువాత మనం చేసే అర్చనలకు మరి కొంత పరిపక్వత వస్తుందని నా అభిప్రాయం.

ముందుగా శ్రీ చక్రం ఎలా ఉంటుందో చూద్దాము;

"బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ  మన్వస్ర నాగదళ షోడశ పత్రయుక్తం
వృత్త త్రయంచ ధరణీ సదన త్రయంచ శ్రీ చక్ర రాజ ఉదితః పరదేవతాయాః"

గోపురము వలే కనబడు శ్రీ చక్రము చూడటానికి పైనుండి క్రిందకు క్రమముగా; 
1. బిందువు
2. త్రికోణము
3. వసుకోణం
4. అంతర్దశారము
5. బహిర్దశారం
6. చతుర్దశారం
7. అష్టదళపద్మం
8. షోడశదళపద్మం, దాని చుట్టూ మూడు వృత్త రేఖలు
9. మూడు రేఖలతో ధరణీ సదనం (భూపురం)

బిందువు  వద్ద పరదేవత అయిన శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారు ఆశీనురాలై ఉంటుంది. 

నవావరణములు: 

శ్రీ చక్రం లో తొమ్మిది ఆవరణలు ఉంటాయి. వాటినే నవావరణలు అంటారు. 
బయటనుండి కేంద్రం వైపు పోయే వరసలో వాటి పేర్లు ఈవిధంగా వుంటాయి. 

1. ధరణీ సదనం లేదా భూపురం
2. పదహారు దళ పద్మం
3. నాగ(అష్ట) దళ పద్మం
4. చతుర్దశారం
5. బహిర్దశారం
6. అంతర్దశారము
7. వసుకోణం
8. త్రికోణము
9. బిందువు

వీటి గురించి వివరంగా రాబోయే వ్యాస పరంపర లో తెలుసుకుందాం

***





Friday, September 22, 2017

బ్రహ్మోపాసన - సాధనాచతుష్టయం : Four Ways for Enlightenment!

శ్రీ ఆదిశంకరుల గ్రంధాలు అన్నిటిలోనూ 'వివేక చూడామణి' ప్రత్యేక స్థానాన్ని అలంకరించింది. 
ఆత్మ జ్ఞాన విషయం ఇంతకంటే సులభరీతిన మరే గ్రంధం లోనూ చెప్పబడలేదేమోనని పెద్దల అభిప్రాయం. 580 శ్లోకాలతో ఉన్న ఈ గ్రంధం వేదాంత విజ్ఞాన ఆకాశంలో ప్రకాశిస్తున్న ధ్రువ తార.
ఇందులో ఎన్నో విషయాలు ప్రతిపాదింప బడ్డాయి. మనం ఈ రోజు బ్రహ్మోపాసనకు సోపానమైన 'సాధనాచతుష్టయం' గురించి తెలుసుకుందాం.

బ్రహ్మోపాసనకు నాలుగు సాధనాలు చెప్పబడినవి. ఈ సాధన చతుష్టయం బాగా అభ్యసించినవాడే బ్రహ్మ విద్యకు అధికారి. అవి ఏమిటో చూద్దాం.

1. వివేకం
2. వైరాగ్యం
3. షట్సంపత్తి
4. ముముక్షత్వం 

వివరణ: 

వివేకమనగా నిత్య అనిత్య వస్తు నిర్ణయం. బ్రహ్మమే సత్యమని, జగత్తు మిధ్య అని ధృడ విశ్వాసం కలిగి ఉండటమే వివేకం. 

ఇంద్రియాల ద్వారా అనుభవించదగిన సమస్త భోగ వస్తువులు అశాశ్వతాలు అని ఎరిగి వాటి మీద కోరిక లేకపోవటమే వైరాగ్యం. 

ఇక షట్సంపత్తి అనగా ఆరు సంపదలు. అవి ఏమిటో చూద్దాం;
- శమం
- దమం (ఉపరతి)
- తితీక్ష
- శ్రద్ధ
- సమాధానం 
- ముముక్షత

ఇక వీటి వివరణ చూద్దాం:

అసంఖ్యాకమైన ఇంద్రియ విషయాలలోని దోషాలను ఎరిగి వాటినుండి మనసు మరల్చి, గమ్యమైన ఆత్మ సాక్షాత్కారం పై స్థిరంగా లగ్నం చెయ్యటాన్ని శమం అంటారు. 

జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను నిగ్రహించి పరబ్రహ్మం మీద ద్రుష్టి ఉంచడాన్ని దమం అంటారు. బాహ్య ఆకర్షణలకు లొంగక మనస్సు ను అంతర్ముఖం చెయ్యడాని ఉపరతి అంటారు. 

శీతోష్ణాలు, ఆకలి దప్పికలు మొదలైన ఈతి బాధలను ఓర్చుకుంటూ, ఇతురులు చేసే అపకారాలను క్షమించి వాటి వలన బాధపడకుండా ఉండటాన్ని తితీక్ష అంటారు.

శాస్త్ర వాక్యాలలోనూ , గురు వాక్యాలలోనూ పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండటం శ్రద్ధ అంటారు. 

ఏకాగ్రతతో బుద్ధిని పరబ్రహ్మం నందు నిలపడాన్ని సమాధానం అంటారు. 

అజ్ఞానం వలన కలిగే దేహభావం, అహంకారం - వీటివలన కలిగే ఇతర బంధాలను తెంచుకుని సస్వరూపాన్ని తెలుసుకుని ఆత్మ సాక్షాత్కారం ద్వారా ముక్తిని పొందాలనే తపన ను 'ముముక్షుత'  అంటారు. 

***


Wednesday, September 20, 2017

మనిషి - నాలుగు పరిమాణాలు : Four dimensions of man !

మనం క్రిందటి సంచికలో మనిషికి నాలుగు పరిమాణాలు ఉంటాయి అని తెలుసుకున్నాము. అవి జాగ్రద్, స్వప్న, సుషుప్తావస్థలు మరియు ఆత్మ. వాటి గురించి మరి కొంత విపులం గా తెలుసుకుందాము. 

మొదటి పరిమాణం- వైశ్వానరుడు - జాగ్రదావస్థ: 

మనం జాగ్రదావస్థలో ఉన్నప్పుడు  పనిచేస్తూ ఉంటాము, చదువుతుంటాము, ఆడుతూ ఉంటాము, చింతన చేస్తూ ఉంటాము. ఇదంతా చేయుస్తూ, జాగ్రదావస్థలో ఈ జగత్తు ను అనుభవించేవాడు వైశ్వానరుడు. అంటే జగత్తును అనుభవించే స్థితిలో మనం వైశ్వానరుడు అనే పేరు పొందుతాము.   మనం బాహ్య జగత్తును అనుభవించడం మన స్థూల శరీరం తోనే. అందుకే మన స్థూల దేహం బాహ్య జగత్తు యొక్క అంగంగా సూచించబడుతోంది. ఈ జాగ్రదావస్థలో 19 ద్వారాల ద్వారా ఈ బాహ్య ప్రపంచాన్ని అనుభవిస్తున్నాము. అవి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 పంచప్రాణాలు, మనసు, బుద్ధి, అహం, చిత్తం అనే నాలుగు (వీటి గురించి మనం విపులంగా గత సంచికలో చదివాము). ఈ విధంగా జాగ్రదావస్థలో స్థూల ప్రపంచాన్ని అనుభవించే స్థితిలో మనం వైశ్వానరుడు అనబడుతున్నాము. ఇది మన మొదటి పరిమాణం.

రెండవ పరిమాణం - తైజసుడు - స్వప్నావస్థ :

తరువాతది స్వప్నావస్థ. ఇక్కడ బాహ్య జగత్తు లేదు. అనుభవాలన్నీ మానసిక జగత్తు లోనే కలుగుతాయి. శరీరం నిద్రలో విశ్రాంతి తీసుకుంటుంది.  ఆ సమయంలో కూడా మనసు పనిచేస్తూ ఉంటుంది. కానీ మనకు బాహ్య జగత్తు స్ఫురణ ఉండదు. ఎందుకంటే బాహ్య జగత్తును స్ఫురింపజేసే చేతన మనసు  నిద్రలో మునిగి ఉంటుంది. కానీ సుప్త చేతన మనసు మేల్కొనే ఉంటుంది. ఆ మనసు ఒక నూతన లోకాన్ని సృష్టిస్తుంది. అదే కల -స్వప్న లోకం. ఈ స్వప్న లోకం గురించి బృహదారణ్యక  ఉపనిషత్తు ఈ విధంగా వివరిస్తోంది; "అక్కడ రధాలు లేవు, పూన్చడానికి జంతువులు లేవు, బాటలు లేవు, సుఖాలు లేవు, సంతోషం లేదు, ఆనందం లేదు. అక్కడ కాసారాలు లేవు, జలాశయాలు లేవు, నదులు లేవు. అతడు అన్నిటినీ సృజిస్తాడు. ఎందుకంటే అతనే సమస్తాన్ని రూపొందిచేవాడు కనుక"  

శరీరము, చేతన మనసు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు సుప్త చేతన మనసు ఇటువంటి పనులు చేస్తుంది. ఒక లోకాన్ని తనకంటూ సృష్టించి సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. స్వప్నలోకాన్ని అనుభవిస్తున్న స్థితిలో మనిషి తైజసుడు అనబడతాడు. 

మూడవ పరిమాణం - ప్రాజ్ఞుడు - సుషుప్తావస్థ :

కోర్కెలో, కలలో- ఏది లేని ఘాడ నిద్రావస్థ మనిషి యొక్క మూడవ పరిమాణం. ఈ స్థితిని అనుభవించేవాడు ప్రాజ్ఞుడు. ఈ స్థితిలో అనుభవాలు ఏవి వుండవు. గ్రహణ శక్తి బహిర్గతమై ఒక రాశి గా ఉంటుంది.  అందువలన ఇది జాగ్రద్, స్వప్న అవస్థలకు ద్వారంగా ఉంటుంది. 'నేను' స్ఫ్రహలో లయించిన మనసు, బయటకు వస్తున్నపుడు మొదటి స్థితిలో కల, ఇంకా బాహ్య స్థితిలోకి వస్తున్నప్పుడు జాగ్రదావస్థ అనుభవిస్తుంది. అందుకే ఇది తక్కిన రెండు స్థితుల ద్వారం అని చెప్పబడింది. ఘాడ నిద్రలో ఉన్న ఒకే అనుభవం సుఖం. అందువల్లనే నిద్రనుండి లేవగానే ' నేను సుఖంగా నిద్రపోయాను' అంటూ మనం చెప్పగలుగుతున్నాము.

బాహ్య జగత్తు యొక్క అనుభవాలు, మానసిక జగత్తు లో పొందే అనుభవాలు కలగలిసినదే మన జీవితం. 'నేను' అన్న స్పురణ ఉన్నప్పుడు మాత్రమే ఈ అనుభవాలను మనం పొందగలం. ఈ 'నేను' స్పురణ లేకపోతే ఏ అనుభవాలు ఉండవు. ఈ స్పురణకు ప్రాతిపదికగా ఉన్నది సుషుప్తావస్థ లోని మూడవ పరిమాణమైన ప్రాజ్ఞుడు. కనుక ప్రతి జీవిలోనూ నేత స్థితిలో ఉన్నవాడు ప్రాజ్ఞుడు.'నేను' లేకుంటే 'నాకు' జగత్తు లేదు. అందుకే ప్రాజ్ఞుడు సమస్తానికి మూల కారణం. 

నాలుగవ పరిమాణం - ఆత్మ: 

నాలుగవ పరిమాణం అని చెప్పబడినప్పటికినీ, ఇది నిజానికి మొదటి మూడు పరిమాణాలు తనలో కలిగి ఉన్నది; కానీ వాటికి అతీతమైన ఒక స్థితి. మన యదార్ధ స్వభావం ఇదే. పై మూడు అవస్థలలోను ఆత్మ ఉనికి ఉన్నది. సూర్యుని సమక్షంలో లోకం నడుస్తోంది. కానీ ఏ కార్యంలోనూ సూర్యుడు ప్రత్యక్షంగా పాల్గొనడు. అలాగే మన సమస్త కార్యకలాపాలు ఆత్మను ప్రాతిపదికగా చేసుకుని జరుగుతాయి. 

ఆత్మ ను గురించి మాండూక్యోపనిషత్తు చక్కగా ఈ విధంగా వివరణ ఇస్తోంది: 

"ఆత్మ అంతర్ముఖ స్థితికాదు, బాహ్య ముఖ స్థితి కాదు. చైతన్యం సమకూరిన స్థితి కాదు; చేతన స్థితి కాదు, అచేతన స్థితి కాదు. అది కనిపించదు. చేతలు లేని, గ్రహించ శక్యం కాని, గుర్తులు లేని, ఊహాతీతమైన, వర్ణనాతీతమైన స్థితి అది. దానిని ఆత్మ చైతన్యం లో మాత్రమే తెలుసుకోగలం. అక్కడ ప్రపంచ చైతన్యం లేదు. అది ప్రశాంతమైనది, మంగళకరమైనది, అద్వయమైనది. ఇదే నాలుగవ పరిమాణం. ఇది ఆత్మ. దీనినే తెలుసుకోవాలి" 

****


                            

Tuesday, September 19, 2017

లోకం, మనిషి, భగవంతుడు -- మూడు మౌలిక సత్యాలు!


మనం(జీవి), మనం జీవించే లోకం (జగత్తు), ఈ రెండిటికీ కారణభూతమైన భగవంతుడు - ఈ మూడూ మౌలిక సత్యాలు. ఈ మూడూ నిజానికి ఏమిటి, వీటికి మధ్య నెలకొన్న సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలు అనాదిగా తత్త్వ వేత్తలను ప్రేరిపిస్తూ వస్తున్నాయి. మన ఉపనిషత్కాలపు ఋషులు ఈ మూల సత్యాలను చక్కగా విచారణ చేసి చక్కని సమాధానాలను పొందగలిగేరు. అవి ఏమిటో మన పరిదిలో మనం చూద్దాం. 

లోకం: 
లోకం అంటే ఎదో శూన్యం నుంచి ఒక్కసారిగా సృస్థించబడింది కాదు. కారణం లేకుండా ఏ కార్యమూ జరుగదు. శూన్యం నుండి దేనిని సృస్థించలేము. ఆ విధంగా, ఉన్న దేనినీ లేకుండా చేయడం సాధ్యం కాదు.  అది అత్యంత సూక్షం గా మారవచ్చు. మళ్ళీ స్థూల వస్తువు గా మార్పు చెందవచ్చు. బీజం నుండి చెట్టు, చెట్టునుండి బీజం ఇలా పునరావ్రతం అవుతాయి. ఇదేవిధంగా జంతువులు, మానవులు కూడా. స్థూలం నుండి సూక్ష్మం ...మళ్ళీ సూక్షం నుండిస్తూలం; ఇలా చంక్రమణం సాగుతూ ఉంటుంది. 

దీనిని బట్టి చూస్తే, ఈ లోకానికి ఆద్యంతాలు లేవని తెలుస్తోంది. సృష్టి ఆద్యంతరహితమైనదని వేదాలు చెపుతున్నాయి. కనుక సృష్టి లేనటువంటి కాలం ఎప్పుడూ లేదని తేలుతోంది.  కొన్ని సమయాలలో లోకం నిష్క్రియ స్థితిలోనూ, కొన్ని సమయాలలో క్రియాజనిత స్థితిలోనూ ఉంటుంది. అంటే లయం నుండి ఆవిర్భావం, ఆవిర్భావం నుండి లయం కొనసాగుతూ ఉంటాయి. 

మనిషి: 
ఇక మనిషి ఎవరన్న ప్రశ్నకు మన ఉపనిషత్తులు నుండి రెండు ముఖ్యమైన సమాధానాలు లభిస్తున్నాయి. వాటిలో ఒక సమాధానాన్ని మాండూక్యోపనిషత్తు చెపుతుంది. మనిషి లో నాలుగు పరిమాణాలు నిండి ఉంటాయి అంటుంది ఈ ఉపనిషత్తు. 

జాగ్రద్, స్వప్న, సుషుప్తి అనే మూడు స్థితులలో మనం మార్చిమార్చి సంచరిస్తూవుంటాము. వీటిలో మనం విభిన్నమైన అనుభవాలను పొందుతాము.ఇన్ని పరిమాణాలు అతడికి ఉన్నప్పటికీ అతడు ఎవరు అంటే ఇన్ని పరిమాణాలను తనలో ఇముడ్చుకున్న ఒక మనిషి. 
మనం ఈ మూడు స్థితులలోనూ లోకంతో సంబంధం కలిగి ఉంటాము. ఈ మూడు అవస్థలను ఇముడ్చుకున్న మొత్తం పరిణామమే ఆత్మ. ఇది నాలుగవ పరిమాణం అని చెప్పబడుతోంది. 

భగవంతుడు:
భగవంతుడు అనే పదానికి అత్యున్నత స్థితి వివరణను మాండూక్యోపనిషత్తు ఇస్తోంది. భగవంతుడు ఎవరు అనే దానికి 'ఆత్మే భగవంతుడు' అనే మహావాక్యాన్ని 'అయమాత్మా బ్రహ్మ'  అని చెప్పింది.భగవంతుడు సర్వవ్యాపి కనుక అయన మనలోనూ కొలువై ఉన్నాడు. మన హృదయం లో ప్రకాశించే స్థితిలో  ఆయన ఆత్మ గా పేరుగాంచాడు. ఓంకారం  అనే ప్రణవనాదాన్ని భగవంతునికి ప్రతీకగా మాండూక్యోపనిషత్తు నెలకొల్పుతోంది. 

సమస్తమూ ఒకటే!
భగవుంతుడిని ఓంకారం గా చెప్పినప్పుడు, అయన సర్వవ్యాపి కనుక లోకం కూడా ఓంకారంలోనే ఇమిడి వుంది. మనిషి లోకంలోని వాడు కనుక, మనిషి కూడ ఓంకారం లో ఉన్నట్లే. అలాగే ఆత్మ స్థితిలో మనిషి, భగవంతుడు ఒకటే అని చెప్పుకున్నాము కనుక మనిషి = భగవంతుడు. . అవన్నీ పరిశీలించిన పిదప, లోకమూ, మనమూ, భగవంతుడు వేరు కాదన్న విశిస్థమైన అభిప్రాయం మాండూక్యోపనిషత్తు ప్రతిపాదిస్తుంది. అనగా లోకం = మనిషి = భగవంతుడు. 

****

Sunday, September 17, 2017

కలలూ, కారణాలు, రకాలు !


మనం నిద్రించినపుడు తరుచుగా కలలు రావటం కద్దు. కొన్ని మంచి కలలు గా అనిపించవచ్చు మరి కొన్ని పీడకలలు గా తోచవచ్చు. మరి ఈ కలులు అంటే ఏమిటి, అవి రావటానికి కారణం, వాటిలో రకాలు గురించి మన జ్ఞానులు చెప్పిన విషయాలు తెలుసుకుందాం.

మనం మెలకువ గా ఉన్నప్పుడు చేతన మనసు మాత్రమే పనిచేస్తుందని క్రిందటి బ్లాగ్ లో తెలుసుకున్నాము. ఈ చేతన మనసు (conscious mind) మన మనసులో స్వల్ప భాగమే. ఈ భాగాన్ని పనిచేయించేది మనసులోని అతి పెద్ద భాగమైన సుప్తచేతన మనసు (sub-conscious mind). మనం నిద్రించే సమయంలో చేతన మనసు కూడా విశ్రాంతిలో ఉంటుంది. కానీ సుప్తచేతన మనసు పనిచేస్తుంటుంది. మనకు కలలు రావటానికి కారణం ఈ సుప్త చేతన మనసే. కలలు గురించి విచారణ చేసిన జ్ఞానులు నాలుగు రకాలైన కలలు గురించి వివరించారు.

1. కొనసాగింపు కలలు: 
కొన్ని కలలు జాగ్రదావస్థలో జరిగిన సంఘటనలకు కొనసాగింపుగా ఉండవచ్చు. ప్రతి సంఘటన మనసులో ఒక సంస్కారాన్ని నమోదు చేసి వెళుతుంది. ఆ సంస్కారం సుప్త చేతన మనసు లో పొందు పరచ బడుతుంది. కొన్ని సమయాలలో ఈ సంస్కారాలు పనిచేసి జరిగిన సంఘటనలకు కొనసాగింపుగా కలలు కలుగుతాయి. ఇవి సాధారణమైన కలలు.

2. అణచివేసుకున్న భావాల కలలు:
మన కోరికలు, ఆశయాలు అపరిమితం. వీటిలో కొన్నిటిని మాత్రమే తీర్చుకోగలం, లేక వ్యక్తపరచగలం. మిగతా వాటిని కుటుంభ లేక సామాజిక కారణాలవలనో సుప్త చేతన మనసులో 
అణిచివేసుకుంటాము. ఇవి స్వప్నావస్థలో బయటపడతాయి. ఇవి ప్రత్యక్షంగా రాలేక పరోక్షంగా కలల రూపంలో బయటపడతాయి. వీటిలో అర్థరహితమైన కలలు కూడా ఉంటాయి.  

౩. భవిష్యవాణి కలలు:
సుప్త చేతన మనసు విస్తృతమైనది మరియు శక్తివంతమైనది. కొందరి విషయం లో, కొన్ని సమయాలలో అది భవిష్యత్తును కూడా చూడగలదు. అవి కొందరికి కొన్నిసమయాలలో భవిష్యత్తును సూచిస్తున్న కలలు గా రావచును. 

4. దివ్య స్వప్నాలు: 
అతి కొద్దిమంది జీవితాలలో కలల ద్వారా దైవానుగ్రహం లభించడం కద్దు. దర్శనాలు, దివ్యానుభవాలు వంటివి కలలో కలగడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. పలు సమయాలలో మనం కనే దివ్య స్వప్నాలు కొనసాగింపు కలల కోవకే చెందుతాయి. అనగా మనం చదివిన, విన్న దివ్య అనుభవాల  విషయాలకు ఇవి కొనసాగింపు మాత్రమే. స్వప్నం తరువాత అది మన జీవితంలో కనబరిచే ప్రభావం బట్టి అది దివ్య స్వప్నమా లేక సాధారణ స్వప్నమా అని తెలుసుకోవచ్చు. నిజమైన దివ్య స్వప్నం ఆ వ్యక్తి జీవితం లో గొప్ప మార్పు తెస్తుంది. అతని జీవితం పూర్తిగా భగవన్మయమైన  జీవితం గా మారిపోతుంది.  అలా కాక జీవితం పాత దోరణిలోనే సాగిపోతూ వుంటే అది సాధారణమైన కలగానే భావించవచ్చు. 

***

మనసు, బుద్ది, అహంకారం, చిత్తం!


మనసు(Conscious Mind), బుద్ధి(Intellect), అహంకారం(I or Ego), చిత్తం(Sub-conscious Mind) - ఈ నాలుగూ మనసులోని విభిన్న స్థితులు. అవి ఏమిటో వాటి పనులేమిటో చూద్దాం! 

మనసు అన్నది ఇక్కడ చేతన మనసును (Conscious Mind) సూచిస్తుంది. మనం కన్ను, చెవి, ముక్కు మొదలగు ఇంద్రియాలద్వారా బాహ్య జగత్తును అనుభవించటం ఈ మనసు ద్వారానే జరుగుతుంది. ఇంద్రియాలు పంపే సమాచారాన్ని సేకరించి ఈ మనసే మన సుఖ లేక దుఃఖ అనుభూతులకు హేతువు అవుతుంది.

మనసు యొక్క నిర్ణయాత్మకమైన భాగం బుద్ధి (Intellect) అనబడుతుంది. "ఇటుగా వచ్చేది రాముడేనా లేక భీముడా?"  అంటూ తికమక పడేది చేతన మనసు. "ఆ వచ్చేది నిశ్చయంగా రాముడే"  అని నిర్ణయించేది లేక ద్రువీకరించేది బుద్ధి. 

ఇంద్రియాల ద్వారా మనం అనుక్షణం పొందే అనుభవాలు ప్రతి ఒకటి మన మనసు పొరలలో ఒక్కొక్క విభాగం గా ప్రోగుచేయ బడతాయి. దీనినే చిత్తం లేక సుప్త చేతన మనసు (Sub-conscious Mind) అంటారు. చేతన మనసు ఒక విషయాన్నీ గురించి నిర్ణయించలేక తికమక పడినప్పుడు, చిత్తం లో ఉన్న పాత అనుభవాలను జోడించి బుద్ధి ఒక నిర్ణయానికి వస్తుంది. "ఇతడా లేక అతడా?" అన్న ప్రశ్న తలెత్తినప్పుడు బుద్ది సుప్త చేతన మనసును సలహా అడుగుతుంది. అతనిని ఇంతకు క్రితమే మనం చూసిన అనుభవం ఉంటె, వాటి తాలూకు గుర్తులు అక్కడ వుంటాయి. దానిని బట్టి "ఇది అతడే!" అని బుద్ధి నిర్ణయానికి వస్తుంది. 

మనం మెలకువగా ఉన్నప్పుడూ, కల కంటున్నప్పుడూ, ఘాఢ నిద్రపోతున్నప్పుడూ,  లేక ఏ స్థితిలో ఉన్నప్పటికీ, 'నేను ఉన్నాను'  అన్న స్ఫురణ మనను విడిచిపోదు. అది మన మనసు వెంటే ఎప్పుడూ ఉంటుంది. దీనినే అహం లేక నేను అంటారు.  ప్రతి అనుభవానికి ప్రాతిపదిక గా అహం ఉంటుంది. అది లేకుండా మనకు ఏ అనుభవం ఉండదు. కనుక అన్నిటినీ ' నా అనుభవాలు' అంటాము. పదిమంది నిద్రపోతున్నారు అనుకుందాం. వారిలో రాముడనే నేను కూడా ఉన్నాననుకుందాం. ఇంతలో ఎవరో 'రామూ'  అని గట్టిగా పిలవగానే, నాకు మెలకువ వచ్చి 'ఓయి' అంటాను. అంటే ఈ 'నేను' అనేది ఎల్లప్పుడూ స్ప్రహ లోనే ఉంటుంది. 

**** 


Friday, September 15, 2017

Ishavasyopanishad - Slokas 12-14 : ఈశావాశ్యోపనిషత్ - 12 నుండి 14 వ శ్లోకం వరకు! (సమాప్తం)


In the following 3 Shlokas, the Rishi is explaining the individual implications of worshipping physical or manifest forms (Saakara) of the Supreme Being, and also the implications of worshipping non-physical or unmanifest (Niraakara) form of the Supreme Being. He says the results of combining both the forms of worship will be totally different.

Shloka 12: 

"Into blinding darkness enter those who worship the unmanifest and into still greater darkness enter those who delight in the manifest"

Shloka 13: 

"Thus we have heard from the wise, the results that come from the worship of the manifest are different from the results of worshipping the unmanifest"

Shloka 14:

"He who understands the manifest and the unmanifest together, crosses death through worship of the manifest and becomes immortal through worship of the unmanifest" 

Explanatory Notes:

The Supreme Being, if given a physical form like Shiva, Vishnu, Durga, and is worshipped, it becomes manifest form of worship. With mind we think of certain attributes and give the deity a form. The other one is worship of the unmanifest. It means, we give no name, or form, or attribute to the Supreme Being as He is beyond grasp of the mind and intellect,but continue our worship. This is possible for those who have reached a certain higher level of consciousness. 

Those who worship the unmanifest without attaining corresponding spiritual maturity, get into self-deceit and hence the Rishi says, they enter the world of darkness. Similarly those who worship the manifest, but do not realise the supreme truth of all pervading nature of the Supreme Being and get into petty bickering that their God is superior to all others, enter into even darker worlds. 

The ancient sages have explained the results of both these forms of worship as capable of giving different results.

So the best results, the Rishi says, would come when one worships various physical forms with the deep consciousness that the underlying Supreme Being is one and only one. With this maturity if one continues his progress, he will reach a stage of understanding the subtleties of the worship of the unmanifest. 

He who reaches such a stage of maturity, crosses death (realises the permanence of the Soul) through worship of the manifest. Further he becomes immortal (gets released from the cycle of births and deaths) through worship of the unmanifest. 

With this we have completed the understanding of Ishavasyopanishad to the extent that is relevant for us. The remaining 3 Shlokas are not currently relevant for us and hence I am leaving them out from the current study.

***

తెనుగు సేత:

భగవంతుని సాకార రూపం లోనూ లేక నిరాకార రూపం లోనూ ఆరాధించవచ్చు. రెంటికీ వాటి వాటి ఫలితాలు ఉంటాయి. కానీ రెంటిని కలిపి ఆచరిస్తే ఉన్నతమైన ఫలితం కలుగుతుందని ఋషి ఈ క్రింది మూడు శ్లోకాలలోనూ వివరిస్తున్నాడు. 

12 వ శ్లోకం: 

"భగవంతుని నిరాకారునిగా ఉపాసించేవారు కటిక చీకటిలో మునిగిపోతారు. సాకార భగవంతుని ఉపాసించేవారు అంతకన్నా ఘాడాంధకారంలో ప్రవేశిస్తారు."

13 వ శ్లోకం:

"సాకార ఆరాధన వలన లభించేది ఒక రకమైన ఫలితం. నిరాకార ఉపాసన వలన లభించేది వేరొక ఫలితం అని చెపుతున్నారు మన పూర్వీకులైన మహాత్ములు"

14 వ శ్లోకం: 

"సాకార ఉపాసన, నిరాకార ఉపాసన రెండిటిని సమగ్రంగా మేళవించి గ్రహించినవాడు సాకారోపాసన వలన మరణాన్ని అతిక్రమించి, నిరాకారోపాసన వలన అమరత్వ స్థితికి చేరుకుంటాడు" 

వివరణ:

మనం ముందు చెప్పుకున్న 9 -11 మంత్రాలూ కర్మలు మరియు ధ్యానం యొక్క సమ్మేళనం యొక్క ప్రాముఖ్యాన్ని బలపరిచినట్లు ఈ మూడు మంత్రాలు రెండు విధాల ఉపాసనల సమ్మేళనాన్ని చెపుతున్నాయి

భగవంతుడు పలు రూపాలలో కనిపించేది సాకార స్థితి. ఎలాంటి రూపము, గుణము లేనిది నిరాకార స్థితి. ఈ రెండు స్థితులలోనూ మనం భగవంతుని ఉపాసించవచ్చు. మొదటిది సాకారోపాసన. రూప నామలుగల ఒక స్వరూపంగా ఆయనను దర్శించటమే ఈ భావన. శివుడు, విష్ణువు, అమ్మవారు అంటూ మనం కొలిచేది ఈ కోవకే చెందుతుంది. 

రెండవది నిరాకారోపాసన. రూపనామాలకు, గుణగణాలకు అతీతమైన స్థితిలో భగవంతుని ఆరాదించటం ఈ కోవకి చెందుతుంది. ఇది మనసుకు అందని స్థితి కాబట్టీ, ఉపాసనలో ఉన్నత స్థితి లోని వారికి మాత్రమే ఇది సాధ్యపడుతుంది. అర్హత లేకుండా ఈ ఉపాసనలో ఉన్నవారు ఆత్మవంచన చేసుకుంటారు. అందుకే వారు కటిక చీకిటిలో మునిగిపోతారు అని ఋషి వాక్కు.

అలాగే సాకారోపాసన లో ఉన్నవారు శివుడు, విష్ణువు మొదలైన పలు రూపాలు ఒకే బ్రహ్మ పదార్ధం యొక్క అనేక రూపాలు అనే సత్యాన్ని ఎరిగిన వారై ఉండాలి. అలా కాకుండా దేవతల మధ్య భేద భావంతో ప్రవర్తించేవాడు ఇలాంటి ఉపాసనతో ఏ సత్ఫలితాన్ని పొందలేడు. కనుక అట్టివారు మరింత ఘాడాంధకారంలో మ్రగ్గుతారని ఋషి వాక్కు. 

కనుక మొదట మన స్వభావానికి తగిన రూపంలో భగవంతుని ఆరాధించాలి. విభిన్న దేవతా మూర్తులను కొలిచినా, వారంతా ఒకే భగవంతుని పలు రూపాలు అనే నిరంతర స్పృహ లో ఉండాలి. సాకార స్థితిలోనే కాకుండా అదే నమ్మకంతో నిరాకార ఉపాసనను కూడా అంగీకరించాలి. అపుడు మనం ఆధ్యాత్మిక పధంలో పురోగమిస్తాము. భగవత్ సాక్క్షాత్కారం పొందుతాము. మరణానికి హేతువైన కర్మ ఫలాలనుండి విడివడతాము. 

ఈ అనుభూతి పర్యవసానం గురించి సంత్ తులసీ దాస్ చక్కగా వివరించారు. "భగవంతుని ముఖాముఖి దర్శించటం వలన ఒనగూరే సాటిలేని ఫలితం ఏమిటో తెలుసా?  మనిషి తన స్వస్వరూపమైన ఆత్మస్థితిలో నెలకొంటాడు." ఆ తరువాతే ఆయనను నిరాకార స్థితిలో ఆరాధించటానికి అర్హతను అయన కటాక్షం వలన పొందుతాడు. అలాంటి అర్హత లభించినప్పుడు ఉన్నతమైన ఆరాధన ద్వారా అమరత్వ స్థితిని పొందుతాడు. 

మంగళం మహాత్!

దీనితో ఈశావాస్యోపనిషత్ మనకు సంబంధించిన వరకు పరిపూర్నమైనదని చెప్పుకోవచ్చు. దీని తదుపరి 3 శ్లోకాలు ప్రస్తుతం మనకు సంబంధించనివి. కనుక వాటి వివరణ ఇవ్వటం లేదు. 

***









Thursday, September 14, 2017

Ishavasyopanishad - Slokas 9-11 : ఈశావాశ్యోపనిషత్ - 9 నుండి 11 వ శ్లోకం వరకు!


These 3 slokas though apparently containing contradictory statements clear the confusion by giving out the way of realising the Supreme Being through two important methods of saadhana.

Sloka 9: 

"Into great darkness enter those who follow or worship ignorance; but those who delight in knowledge enter into greater darkness"

The sloka begins by saying that those who are ignorant or follow the ways of ignorance (Avidya) will enter into darkness. It is clear and understandable. But it also says who delight in knowledge(Vidya) also enter darkness. Looks very confusing and contradictory. Doesn't it? 
All the worldly knowledge we have is considered 'ígnorance' or 'avidya' as it is not the knowledge of the Soul. Hence people steeped in such ignorance enter darkness. Similarly people excelling in any other knowledge and keep taking pride out of it also enter darkness. Only the understanding of the inner Self  is considered true knowledge. Unless we direct our knowledge into realising the inner self, we will still be groping in darkness.

Sloka 10: 

"They say that the result of knowledge (Vidya) is different from the result of ignorance (Avidya). This has been explained to us by the wise"

The Rishi humbly says that the wise have explained that the result one gets out of Knowledge is different and the result one gets out of ignorance would be different. 

Sloka 11:

"But the one who understands these two together, knowledge and ignorance, crosses death through ignorance and attains immortality through knowledge"

To understand ignorance means to understand the implications or results of ignorance. When one understands this, one is free from death. That is, one realises that while the body dies, the inner Self has no death.  

When one understands that the Supreme Being that pervades everything is no different from one's inner Self, one becomes immortal as he breaks the chain of life and death.

****

తెనుగు సేత: 

ఈ క్రింది మూడు శ్లోకాలలో ఋషి చెప్పినవి పైకి విరుద్ధ భావాలలా కనబడినప్పటికి, లోతుగా పరిశీలిస్తే సత్యం బోధపడుతుంది. సర్వత్రా నేలకొని ఉన్న భగవంతుని అనుభూతం చేసుకోవటానికి రెండు ముఖ్యమైన సాధనా పద్ధతులను ఈ మంత్రాలు చెపుతాయి.

9 వ శ్లోకం: 

" ఉన్నత లక్ష్యం లేకుండా ఎవరు కర్మలలో (అవిద్య) పాల్గొంటారో వారు చిమ్మచీకటిలో మ్రగ్గిపోతారు. అలాగే ఎవరు అర్హత పొందడానికి ముందే ధ్యానాన్ని (విద్య) అవలంబిస్తారో వారు అంతకన్నా కారు చీకటిలో మునిగిపోతారు." 

10 వ శ్లోకం: 

" ధ్యానం వలన (విద్య) లభించేది ఒక రకమైన ఫలితం. కర్మల (అవిద్య) వలన లభించేది మరొక రకమైన ఫలితం. మాకు దానిని వివరించిన మహాత్ములు ఇలా వచించారు." 

11 వ శ్లోకం:

" ధ్యానము (విద్య) కర్మలు (అవిద్య) కలిపి తెలుసుకున్నవాడు కర్మల ద్వారా మరణాన్ని అధిగమించి, ధ్యానం ద్వారా అమరత్వాన్ని పొందుతాడు" 

వివరణ:

భగవత్పరమైన కార్యం మాత్రమే విద్య అని శాస్త్రాలు చెపుతున్నాయి. తక్కినవన్ని అది విజ్ఞానమైన సరే, వేదాధ్యయనం అయినా సరే అవిద్య గానే చెప్పబడుతుంది. వీటిని పట్టుకున్నవాడు అంధకారం లో కొట్టుమిట్టాడుతాడు.  అలాగే జపం తపం భగవంతుని ఉద్దేశ్యించి చెయ్యకుంటే అవి కూడా అవిద్య అని చెప్పబడుతాయి. ఈ సాధనలు ఉన్నత లక్ష్యం అయిన పరమార్ధం గురించి అంటే విద్యతో జోడించి చెయ్యబడాలి.  లేకపోతే సాధకుడు కటిక చీకటిలో మునిగిపోతాడు. 

ఈ రెంటి వలన కలిగే  ఫలితాలు వేరే వేరే గా ఉంటాయి అని మహాత్ములు వచించారు. 

కానీ ఈ రెంటిని తెలుసుకుని సాధన చేయటం వలన, అవిద్య నుండి విముక్తుడై ఆత్మ యొక్క శాశ్వతత్వం తెలుసుకుంటాడు. అంతతో ఆగక మరింత సాధనతో, కర్మ ఫలితాలనుండి విడివడి, ఆత్మ స్వస్వరూపం తెలుసుకుని జీవన్ముక్తుడు అవుతాడు. 


****













Wednesday, September 13, 2017

Ishavasyopanishad - Sloka 8 : ఈశావాశ్యోపనిషత్ - 8 వ శ్లోకం!


From here onward, we shall be only discussing the meaning and explanation of the sloka without actually reproducing the text of the sloka. The sloka is important for those who have taken up chanting and chanting should be learnt from a Guru. Here what is important to us is the essence of the sloka so that it can guide our thinking.

The 8th Sloka: 

Here the Rishi dwells upon the experience of the one who has realised the Supreme Being.

"His radiance has filled everywhere; He has no form; Is not vulnerable to any injury; He is not a physical being; Is pure, untouched; He is the seer, the thinker, the all pervading Self"

The import of the above statements can be understood by way of the following explanatory notes:

1. The Supreme being is radiant . The Universe basks in His radiance.

2. He can not be identified with a physical form. He has no body, is complete, undivided.

3. He is absolutely pure and is untouched by any act of evil.

So the one who has realised the Inner Self, is the same as the Supreme Being.


****

తెనుగు సేత:

ఇప్పటినుండి శ్లోక భావం మాత్రమే ఇవ్వటం జరుగుతుంది, శ్లోకం ఉటంకించటం ఉండదు. ఎందుకంటే శ్లోకం పారాయణ లేక పఠనం కి పనికి వస్తుంది. అది గురు ముఖతః నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ బ్లాగ్ ఉద్దేశ్యం అదికాదు. ఈ శ్లోక భావం మనం తెలుసుకుని అంకితభావంతో దాన్ని ఆచరణలోకి పెట్టటానికి దోహదం చెయ్యటమే!

8 వ శ్లోకం:

ఆత్మానుభూతి పొందిన వ్యక్తి అనుభవాన్ని ఈ మంత్రం చెపుతుంది.

"ఆత్మానుభూతిని పొందినవాడు అన్నిటి అంతరార్ధాన్ని గ్రహిస్తాడు. అతడు మనసును వశం చేసుకున్నవాడు. యావత్తు జ్ఞానాని తనలో పదిలపరచుకున్నవాడు. ఎవరికీ చెందనివాడు. సకల వస్తువుల నైజాన్ని అతడు అవగతం చేసుకున్నవాడు. తన జ్యోతిర్ప్రకాశం తో అంతనూ తేజోవంతం చేసేవాడు. శరీరం లేని, స్వచ్చమైన, పరిపూర్ణమైన, కళంకం లేని అఖండమైన భగవత్స్వరూపం"

దీనిని బట్టి మనం ఈ క్రింది మూడు విషయాలు తెలుసుకోవచ్చు:

1. భగవంతుడు తేజోమయమైనవాడు. అయన ప్రకాశం తో సమస్త ప్రపంచం ప్రకాశిస్తోంది. 

2. ఆయనను చర్మ చక్షువులతో గుర్తించటానికి వీలు లేనివాడు. అయన శరీరం లేనివాడు, పరిపూర్ణుడు, అఖండుడు.

3. అయన పవిత్రుడు, ఏ కళంకం లేనివాడు. ఎవరి లేక దేని లోటుపాట్లు ఆయనను బాధించవు.

ఆత్మానుభూతిని పొందినవాడు ఈ విధంగా తేజోమయుడైన భగవంతుని తో ఏకమైపోతాడు.


***



Tuesday, September 12, 2017

Ishavasyopanishad - Sloka 7 : ఈశావాశ్యోపనిషత్ - 7 వ శ్లోకం!


The Rishi further says the following as a corollary to what has been said in the 6th sloka:


"యస్మిన్  సర్వాణి  భూతాన్యా త్మైవాభూద్విజానతః

తత్రకో మోహః  కః శోక ఏకత్వమనుపశ్యతః

"When one realises that the Supreme Self is the inner reality of all beings, when one realises that all beings are his own self; such a person, who is established in complete Oneness; where in him is the place for delusion and where is the place for sorrow?"

All the sorrow and delusion that we experience in this world is due to the existence of duality in our minds. We feel we are different from the others. We don't feel the Oneness of the Self. That's why we hanker after things that we see others having them. When we fail to acquire the things that the others have, we become jealous and sorrowful. On the contrary, the enlightened person, who sees his Self in everyone, doesn't get affected by such things and he will not fall into delusion or sorrow. This is a supreme state which everyone should try to reach through persistent saadhana and aatma vicharana.


***

తెనుగు సేత:

క్రిందటి శ్లోకంలో చెప్పిన ఆత్మభావన ని ఋషి ఈ శ్లోకంలో ఇంకొచెం ముందుకు తీసుకుని వెడుతున్నాడు: 

"ఆత్మ సకల జీవరాసులుగా అభివ్యక్తమైనదని గ్రహించి ఏకత్వ భావన అలవరుచుకున్న  వ్యక్తికి మోహం ఎక్కడుంటుంది, శోకం ఎక్కడుంటుంది?" 

మనం అయిష్టమైన దానిని ద్వేషిస్తాం. ఒకటిని మరొకటిగా చూడటం వలన మోహం కలుగుతుంది.  కోరుకున్నది దొరకనప్పుడు  దుఃఖం కలుగుతుంది. ఆత్మానుభూతి పొందిన వ్యక్తికి ఇటువంటి భావాలు ఉండవని ఈ శ్లోకం లో ఋషి చెబుతున్నారు. 

ఆత్మానుభూతి అనేది ఒక ఆంతరంగిక భావన. బాలుడు, యువకుడు, వృద్దుడు ఒకే ప్రపంచం లో ఉంటున్నారు. కానీ వారు చూసే ప్రపంచం ఒకటిగా వుండదు. దానికి కారణం బయట ప్రపంచం కాదు. వారి భావనలోని వైవిధ్యమే దానికి కారణం. మన కుటుంభాన్ని మాత్రమే ప్రేమించే మన అనుభూతి మెల్ల మెల్లగా విస్తృతి చెంది మన చుట్టాలను, స్నేహితులను , ఇతరులను, దేశాన్ని, ప్రపంచాన్ని ప్రేమిస్తాము. చుట్టూ ఉండే వారిలో ఏ మార్పు ఉండక పోవచ్చు. మార్పు అంతా మన భావనలోనే కలిగింది. మన ప్రేమ భావన విస్తృతి దానికి కారణం. 

ఆత్మానుభూతిలో ఈ భావన ఇంకా పెరిగి మహోన్నతమై ఇక ఎల్లలు లేనిది అవుతుంది. ఇక ఏ మార్పు ఉండని తుది మార్పు అది. వారు సర్వత్ర తననే చూస్తారు. వారిలో ఏ ఆశక్తి లేనందున వారిని లోకంలోని సుఖదుఃఖాలు బాధించవు. అన్ని ద్వంద్వాలకు అతీతులౌతారు.


*****



Monday, September 11, 2017

Ishavasyopanishad - Sloka 6 : ఈశావాశ్యోపనిషత్ - 6 వ శ్లోకం!


In this sloka, the Rishi goes to explain the results of getting enlightenment or Self realisation:  


"యస్తు  సర్వాణి  భూతాన్యాత్మ  న్యేవాను పశ్యతి

సర్వభూతేషు  చాత్మానం  తతోన  విజుగుప్సతే"


"He who sees all beings in his own self, and his own self in all beings, does not feel any revulsion whatsoever"

A person who has realised the inner self through experience and stays in the bliss of such Supreme Being, sees that he has no enemies anywhere. Because he sees his Self in everyone and their Self in him. He fully understands the ultimate truth that "Ishaavasyam idam sarvam" - the Supreme Being is all pervading. Then where is the scope for enemity or revulsion?

***



తెనుగు సేత:

ఈ శ్లోకంలో, తనను ఆత్మగా గ్రహించినవాడు అంటే ఆత్మనుభవం సిద్దించినవాడు పొందే ఫలితం ఏమిటో ఋషి వివరిస్తున్నాడు.

"ఎవరు సకల జీవరాసులను ఆత్మలోనూ, ఆత్మను సకల జీవరాసులలో దర్శిస్తాడో అతడు ఎవరిని ద్వేషించడు."

ఎవరైతే మొదటి శ్లోకం లో చెప్పిన "ఈశావాస్యం ఇదం సర్వం" - సమస్త జీవరాసులలో ఉన్నది అ భగవంతుడే అని అనుభవపూర్వకంగా  తెలుసుకుంటాడో, అతనికి తనలోను, మరియు ఇతరులలోను ఉన్నది ఒకటే ఆత్మ స్వరూపం అని గోచరిస్తుంది. అప్పుడు అతనికి ఎవరి మీద జుగుప్స కానీ వైరం కానీ ఉండబోదు. 


****





Sunday, September 10, 2017

Ishavasyopanishad - Sloka 5 : ఈశావాశ్యోపనిషత్ - 5 వ శ్లోకం!


The Rishi continues to explain the nature of Atma:

"తదేజతి  తన్నైజతి  తద్దూరే తద్వంతికే

తదన్తరస్య   సర్వస్య  తదు  సర్వస్యాస్య  బాహ్యతః" 

"It moves, yet It moves not; It is far, yet It is near; It is within all this; It is outside all this"

Let's see the meaning of these statements:

It moves when we think that we are different from Atma and we make an effort to move towards It. But when we understand that we are not different from the Inner Self, then there is no movement. Because It pervades everything.

As It is inside all of us, It obviously is very close to us. But if we don't realise it, and try to grasp It, then It is very far from us.

Similarly, the Supreme Being or Atma is within everything and also outside of everything which reinforces the content of the first sloka "Ishaavasyam Idam sarvam"


****


తెనుగు సేత: 

ఈ శ్లోకం లో కూడా ఋషి ఆత్మ తత్వాన్ని ఇంకా వివరిస్తున్నాడు. 

"అది చలిస్తుంది, అది చలించదు;  అది దూరంగా ఉంది,  దగ్గరగా కూడా ఉంది;  అది అన్నిటి లోపలా ఉంది, అన్నిటి వెలుపలా కూడా ఉంది" 

ఇక వివరణ చూద్దాం:

లోక వ్యాపారాలన్నిటికీ ఆధారభూతమైనది ఆత్మ.  అందువలన ఆత్మ చలిస్తున్నది. కానీ అది సర్వత్రా వ్యాప్తి చెందినదని తెలిసిన స్థితిలో దానికి చలనం ఉండదు. 

మనందరలోను ఆత్మ ఉండటంవలన అది మనకు చాల సమీప వస్తువు. కానీ విషయం తెలుసుకోనప్పుడు, దానికోసం అన్వేషిస్తున్నపుడు అది చాల దూరంగా ఉంటుంది. 

ఇక పరమాత్మ స్థితిలో ఆత్మ అన్నిటి లోపల ఉంటుంది, అన్నిటి బయట వుంటుంది. 


***

Saturday, September 9, 2017

Ishavasyopanishad - Sloka 4 : ఈశావాశ్యోపనిషత్ - 4 వ శ్లోకం!


This Sloka seeks to explain the nature of Atma. 

" అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా అప్నువన్ పూర్వమర్షత్
తద్దావతో  న్యానత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిశ్వా దధాతి" 

Let's see what the Rishi is saying through this mantra:

"It is One. It is that which doesn't move. But It is faster and swifter than the mind. There is no way the Senses can ever grasp It. By Itself It stands still; but It outruns those who run to reach for It. Because It is there, It makes the life energy - prana, support the activities of all beings"

Let's see the import of this statement part by part:

For anything to move or to work, there should be space. But the Atma is all pervading and hence has no space to move. That's why It has no motion.

Our mind is so fast and goes wherever we want it to go in a fraction of a second. But by the time it reaches there, Atma or the Supreme Being would already be there. Though It stands still, It can outpace anything that tries to grasp It.

The sensory organs can not grasp It. These sensory organs have been designed to carry only the information pertaining to the physical world. So they have no power of inward looking or grasp the inner secrets or the inner Self. 

For something to move about, it needs a pivot or a base from which it moves. For example, a train needs tracks to run. In the physical world, everything moves due to the flow of life energy or prana. The Atma is the stationary base which helps prana to move about and carry out its activities. 

****

తెనుగు సేత:

ఈ శ్లోకంలో ఋషి ఆత్మ యొక్క స్వరూపం లేక నైజం గురించి వివరిస్తున్నాడు. 

"ఆత్మ చలనం లేనిది. అది ఒకటే అయినది. మనసు కంటే వేగమైనది. ఇంద్రియాలు దానిని పొందలేవు. అది స్థిరంగా ఉన్నప్పటికీ అన్నిటికన్నా ముందు వెళుతుంది. చలించే వస్తువులన్నిటి కన్నా వేగవంతమైనది. అది స్థిరంగా ఉండటంవలన ప్రాణం అన్నిటినీ పని చేయిస్తుంది" 

ఇక వివరణ చూద్దాం: 

ఒక వస్తువు చలించాలంటే దానికి ఒక చోటు ఉండాలి. ఎందుకంటే చలించటమంటే ఒక చోటు నుండి ఇంకొక చోటుకు వెళ్ళటం. మరి ఆత్మ సర్వత్ర వ్యాపించి ఉన్నప్పుడు, దానికి చలనం ఎలా సాధ్యం? 

మనసు అతి వేగమంతమైనది. మనం ఎక్కడికి కోరుకుంటే అక్కడికి మన మనసు త్రుటిలో చేరుతుంది. కానీ విశేషం ఏమిటంటే, అది అక్కడకు చేరటానికి ముందే అక్కడ ఆత్మ నెలకొని ఉంటుంది. కనుక ఆత్మ మనసు కంటేను,  మరి ఏ ఇతర వేగవంతమైన వస్తువు కంటే కూడా అతి వేగవంతమైనది.

ఇంద్రియాల ద్వారా  ఆత్మను తెలుసుకోలేము. ఎందుకంటే అవి బాహ్య పదార్ధాలను, భౌతిక ప్రపంచాన్ని తెలుసుకోవటం కోసమే నియమితమైనాయి. అవి అంతరంగిక సత్యాలను, ఆత్మ విచారణ చేయలేవు. 

ఏదైనా చలించాలంటే దానికి ఆధారభూతమైనది ఒకటి కావాలి. ఉదాహరణకి, రైలు పరిగెట్టాలంటే, దానికి రైలు పట్టాలు కావాలి. ఈ లోకంలో అన్ని చలనాలకు కారణ భూతమైనది ప్రాణం. చలించే ప్రాణానికి ఆధారభూతమైనది చలించని ఆత్మే!


***


Friday, September 8, 2017

Ishavasyopanishad - Sloka 3 : ఈశావాశ్యోపనిషత్ - 3 వ శ్లోకం!


This Sloka lays emphasis on the importance of seeking out the inner Self. This would be the first step towards realising the Supreme Being.


" అసుర్యా నామతే లోకా ఆంధేన తమసావృతాః
తాగమ్ స్తే ప్రేత్యాభిగచ్ఛన్తి యేకే చాత్మహనో జనాః" 

"There are demonic worlds enveloped in darkness to which the slayers of Self go after death"

This means there are some worlds which are enveloped in darkness to which those of demonic nature go. Here demonic means those who deny themselves the Inner Reality and believe that there is nothing more than the physical world that we see around and believe that to be real. These do not believe in the existence of Atma. So they are called 'slayers of Atma' . The sloka says these slayers of Atma keep wandering in the darkness of ignorance. 

Though the Atma can not be slayed in the strictest sense, these by denying themselves the realisation of their Inner Self, are guilty of committing  the sin of slaying their Self. Steeped in worldly pleasures, these are shutting the radiance of Inner Light. So the Rushi is saying 'please wake up and look; there is something beyond the physical body'

I will conclude by by quoting the saying of Sri Ramana Maharshi "deham naham koham soham"  which is very relevant for us to understand and put into practice. Let's see the meaning : deham - 'this body'; naham - 'Iam not'; koham - 'who am I?' ; soham - 'the Supreme Being'  

To summarise, "I am not this body. Then who am I? I am the Supreme Being"


***

తెనుగు సేత:

ఈ మూడవ శ్లోకం లో ఋషి ఆత్మవిచారణ యొక్క ప్రాధాన్యత తెలియబరుస్తున్నాడు. ఆత్మ విచారణే పరంధామం చేరే మొదటి మెట్టు. 

"రాక్షసుల యొక్క లోకాలు అంధకారంతో ఆవరింప బడి ఉన్నాయి. ఆత్మ హంతకులు మరణానంతరం ఆ లోకాలను పొందుతారు"

ఈ శ్లోకం యొక్క వివరణ చూద్దాం:

రాగ ద్వేషాలకు లోనై, శరీరంతోనూ, మనసుతోనూ మనలను బంధించుకుని లోకంలోని సుఖభోగాల వేటలోనే జీవితం గడుపుతూ పోతే, మనం జనన మరణ చంక్రమణం లో తిరుగుతునే ఉంటాము. అందుకు మారుగా, అంతరంగిక పురోగతి పైన దృష్తి ఉంచి, ఆత్మ విచారణ వైపు శ్రద్ధ వహిస్తే, భగవత్ స్థితిని పొంది జీవన్ముక్తులు కాగలుగుతాం. 

అలా కాకుండా, ఆత్మ చింతన చేయకుండా శరీరమే సర్వస్వం అనుకుని గడిపే వారిని ఋషి        'ఆత్మ హంతకులుగా' పేర్కొంటున్నాడు.  ఆత్మ కు నాశనం లేదు కాబట్టి, దానిని నశింప చేయడానికి సరి సమానమైన నేరం చేసిన వారని అర్థం. అలాంటివారు మరణానంతరం అంధకార బంధురమైన లోకాలకు పోతారని  ఈ మంత్రం చెపుతోంది.  అంటే జన్మ పరంపరలకు చిక్కి దుఃఖంలో మునిగి వుంటారు. 

కనుక దీనినుండి బయటపడాలంటే ఆంతరంగిక పురోగతిని కోరుకుని ఆత్మ విచారణ చేపట్టాలి. 

ఇక్కడ భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పిన అద్భుతమైన వాక్యంతో ఈ శ్లోక వివరణను ముగించవచ్చు.  అయన ఈ క్రింది వాక్యం తరుచుగా చెప్పేవారుట: 

"దేహం నహం కోహం సోహం"

దీని అర్థం " నేను ఈ దేహం కాదు; మరి నేను ఎవరిని? నేను పరమాత్మనే!" 



***

Thursday, September 7, 2017

Ishavasyopanishad - Sloka 2 : ఈశావాశ్యోపనిషత్ - 2 వ శ్లోకం!


This is the second Sloka which propounds that if one lives a life realising that everything here belongs to Him (as explained in the first sloka), he will escape the karmik bondage. Let's see the meaning of this sloka:

"కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చతగం సమాః
ఏవం త్వయి నాన్య ధేతో స్తిన కర్మ లిప్యతే నరే"

"one can live a hundred years performing the laid down karmas (as that is the only way for you) and not be effected by the results of the karmas"

The meaning is that, it is not possible for us to live on the Earth without performing day to day Karmas or actions. These would be necessary for our survival. As per the law of karma, the good or bad results of such karmas bind the person and put him into the cycle of births and deaths. But what the Rishi says here is that, if such karmas are performed without attachment and fully realising that He is there in everything and that He is the witness of all the karmas or actions, one will not be bound by such karmas even if he performs them for a hundred years.

-Om shanthi shanthi shanthi-

తెనుగు సేత: 


" కర్తవ్యాలను, విహిత కర్మలను చేస్తూ మాత్రమే నూరు సంవత్సరాలు జీవించాలని ఆశించు. నీ లాంటి వారికి అది తప్ప మార్గం లేదు. అలా జీవించటం వలన కర్మలు నిన్ను అంటవు"

ఇప్పుడు ఈ మంత్రం లో ఋషి చెప్పదలచుకున్నభావం ఏమిటో చూద్దాం. 

లోకం లో జీవించాలి; తప్పదు. అందుకోసం పని చేసి తీరాలి. కర్మలను చేయకుండా ఎవరూ జీవించలేరు. ఏ పని చేసినా అందుకు ఫలితం ఉంటుంది. అది మంచి కావచ్చు లేక చెడు కావొచ్చు. రెండూ కలసినది గా కూడా ఉండవచ్చు. ఆ ఫలితం ఏదైనప్పటికీ అది మనలను బంధిస్తుంది. ఇలా కర్మలు కొన సాగుతాయి. ఇది జనన మరణ పరంపరలకు దారి తీస్తుంది. 

కానీ ఈ లోకం భగవంతునికి చెందినదిగా గ్రహించి అయన ఇచ్చిన ఐశ్వర్యానికి, సుఖానికి భాద్యత వహించిన వ్యక్తిగా జీవితం గడిపితే , ఆ భావంతో పని చేస్తే , అ కర్మ వలన వచ్చే ఫలం ఎదైనాసరే మనలను అంటదు (విహితమైన కర్మలు అని చెప్పేము  కనుక, ధర్మ పరమైన పనులే అని అర్థం, అంతే కాని చెడు పనులు, పాప కార్యాలు కూడా చెయ్యొచ్చు,అని దయచేసి అర్థం తీసుకోవద్దు). ఫలితం మనలను అంటనందున అది మన ఆధ్యాత్మ పురోగతికి దోహదం చేస్తుంది. అపుడు మనం ఆత్మ సాధనలో ఒక ముఖ్యమైన మెట్టు ఎక్కినట్లే!

ఓం శాంతి శాంతి శాంతి!


Tuesday, September 5, 2017

Ishavasyopanishad - Sloka 1 : ఈశావాశ్యోపనిషత్ -మొదటి శ్లోకం


Ishavasyopanishad is a part of Yajur Veda and is one of the shortest of all Upanishads. It contains 18 slokas. Despite the shortness, it is one of the important Upanishads. The first sloka goes like this (I am giving the sloka in Telugu as it doesn't read that well in English)

"ఈశావాశ్యం ఇదం సర్వం యత్కించ జగత్యం జగత్
తేన త్యక్తేన భుంజీధా మా గృధః కస్య స్వద్ధనం"


"That Supreme Being pervades everything now and here - that which moves and that which does not move; therefore Let Go and Rejoice; whose wealth is this anyway?"

Let's see the meaning. The Rishis say that 'Isha' the 'Supreme Being' pervades or resides in everything that moves and in everything that at least physically appears to be non-moving. It means He is there in the entire Creation.

So the advice is 'let go'and 'rejoice'. It may look conflicting to the normal mind. Generally or materialistically speaking, enjoyment or rejoicing is associated with acquisition- acquiring more and more things- both physical like material possessions and non-physical like name , fame, glory, respect, etc.'But why are the 'Rishis' saying the enjoyment comes only when you let go of things?

When we hold on to anything physical or notional, we always try to safeguard it. Our entire effort will be towards protecting it from losing. This effort in effect, keeps us in a perennial sense of losing them. So if you observe carefully, the enjoyment we get while acquiring quickly gets diluted with this constant fear of losing it. Then where is the joy? So the 'Rishis' say that, the actual enjoyment comes only on 'letting go things', as that would free us from the fear of losing them. 

We may ask "aren't these our hard-earned possessions?" So the 'Rishis' answer by saying that; as He pervades everything and the entire cosmos belongs to him, then whose wealth is all this anyway? So the essence is - it was never yours, it is not yours, it will not be yours. 
So just 'let go'and enjoy in the divine bliss.

Looks very difficult. isn't it? Yes. indeed. It can only be understood by someone who has given up something and found relief and the joy in doing so!  When He pervades everything, we become self-sufficient. There is nothing that needs to be added from outside as your very Self is not different from Isha.

Does that mean we should give up everything and become a 'sanyasi'? certainly not! What is being said is that as we watch or become aware of this unending process of acquiring, we realise that there is a state of mind which is independent of all this. Things and wealth come and go. When one realises the impermanence of life and when one is faced with the question "Is there anything permanent at all?", the 'Rishis' say that there is something permanent in yourself only and that you don't need to search for it outside. The search for happiness lies in finding that it is in yourself and that is finding 'Ísha' - the Supreme Being.

****


తెనుగు సేత: 

ఈ పైన చెప్పిన శ్లోకం యజుర్వేదం లోని భాగం అయిన ఈశావాశ్యోపనిషత్ లోని మొదటి శ్లోకం.ఈ ఉపనిషత్ లో 18 శ్లోకాలు ఉన్నాయి. ఇది ఒక చిన్న ఉపనిషత్ కానీ దీని ప్రాధాన్యం మాత్రం చిన్నది కాదు.  

ఈ శ్లోకం యొక్క పరమార్థం ఏమిటంటే, జగత్ కర్త అయిన ఈశానుడు, స్థావర జంగమామాత్మకమైన ఈ సృష్తి అంతా నిండి యున్నాడు. కనుక లౌకిక వస్త్వులను అంటిపెట్టుకుని ఉండక వాటి పైన కర్తృత్వ భావాన్ని విడిచిపెట్టి, అలౌకిక ఆనందాన్ని పొందవలెను.

మనం ఒక సందిగ్దం లో పడతాము. లోకంలో ఏదైనా వస్తువు ను పొందినప్పుడు ఆనందం ఉంటుంది కదా, మరి ఇక్కడ వస్తువును విడిచిపెట్టినప్పుడు ఆనందం వస్తుందని చెబుతున్నారని.  ఏదైనా వస్తువును పొందినప్పుడు ఆనందం రావటం నిజమే! కానీ దాన్ని ఎప్పుడు కోల్పోవాల్సి వస్తుందో అన్న బెంగ మొదలు అవుతుంది. ఈ బెంగ క్రమంగా మనం వస్తువుని పొందినప్పుడు వచ్చిన ఆనందాన్ని హరించి వేస్తుంది. 

మనకు ఇంకో సందేహం రావచ్చు. ఈ వస్తువులన్నీ మన కష్టార్జితం కదా వాటిని విడిచిపెట్టి మనం సన్యాసం పుచ్చుకోవాలా అని. మన ఋషులు ఆవిధంగా మనలను చేయ్యమనటం లేదు. 

ఈ విశ్వ కర్త ఆ ఈశానుడు అయినప్పుడు, అయన చైతన్యం అన్నిటి యందు వ్యాపించినప్పుడు, ఈ సృష్టి అంతా ఆయనదే అన్న భావం కలిగినప్పుడు ఇవన్ని అప్పుడు, ఇప్పుడు, మరెప్పుడు నావి కావు, అయన ప్రసాదమే అన్న ఆలోచన కలుగుతుంది. అప్పుడు మానసికంగా వీటిని విడిచిపెట్టినప్పుడు ఆత్మానందం కలుగుతుంది. 

మనం ఆనందం కోసం పడే వెంపర్లాట, మనం బయట ప్రపంచం లో దానికోసం చేసే వెదుకులాట, అన్నీ అంతం అయిపోతాయి. మనం అప్పుడు మనలోనే ఆ శాశ్వత ఆనందం దాగి ఉందని, అదే మనలో నిండిన పరమాత్మ చైతన్యమని స్వానుభూతి తో తెలుసుకుంటాం. అదే సర్వం ఈశ్వర మయం అన్న భావన!

****