The Rishi continues to explain the nature of Atma:
"తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే
తదన్తరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః"
"It moves, yet It moves not; It is far, yet It is near; It is within all this; It is outside all this"
Let's see the meaning of these statements:
It moves when we think that we are different from Atma and we make an effort to move towards It. But when we understand that we are not different from the Inner Self, then there is no movement. Because It pervades everything.
As It is inside all of us, It obviously is very close to us. But if we don't realise it, and try to grasp It, then It is very far from us.
Similarly, the Supreme Being or Atma is within everything and also outside of everything which reinforces the content of the first sloka "Ishaavasyam Idam sarvam"
****
తెనుగు సేత:
ఈ శ్లోకం లో కూడా ఋషి ఆత్మ తత్వాన్ని ఇంకా వివరిస్తున్నాడు.
"అది చలిస్తుంది, అది చలించదు; అది దూరంగా ఉంది, దగ్గరగా కూడా ఉంది; అది అన్నిటి లోపలా ఉంది, అన్నిటి వెలుపలా కూడా ఉంది"
ఇక వివరణ చూద్దాం:
లోక వ్యాపారాలన్నిటికీ ఆధారభూతమైనది ఆత్మ. అందువలన ఆత్మ చలిస్తున్నది. కానీ అది సర్వత్రా వ్యాప్తి చెందినదని తెలిసిన స్థితిలో దానికి చలనం ఉండదు.
మనందరలోను ఆత్మ ఉండటంవలన అది మనకు చాల సమీప వస్తువు. కానీ విషయం తెలుసుకోనప్పుడు, దానికోసం అన్వేషిస్తున్నపుడు అది చాల దూరంగా ఉంటుంది.
ఇక పరమాత్మ స్థితిలో ఆత్మ అన్నిటి లోపల ఉంటుంది, అన్నిటి బయట వుంటుంది.
***
No comments:
Post a Comment