Tuesday, September 5, 2017

What do Upanishads deal with? ఉపనిషత్తులు ప్రతిపాదించేది ఏమిటి?


What do Upanishads deal with? 

Upanishads form the Gnana kanda - the wisdom section of the Vedas.They are concerned with the universal search of trying to find out the meaning of life.

"What is the meaning of life?" 
" Where are we moving in life?" We keep moving from birth to death and evolving. 
"Is there an end to this movement?"
"Is a human being merely born to live, reproduce and die?"
"Is there a deeper purpose and meaning behind all this?"
These are the types of questions dealt in Upanishads.


The Upanishads are written based on the methodology of dialogue or 'samvaad'.Here the disciple goes to the teacher and asks him questions. The teacher does not give him ready made answers. He gives a key and asks the student to meditate and find the answers. The student completes this exercise and goes back to the teacher and says "This is what I found, but I don't think this is complete". The teacher gives some value addition and again asks him to repeat the process. This iteration goes on till they come up with a perfect answer. Now we can see that this is the most evolved form of learning.

These are the basic questions that we need to ask ourselves especially if we consider ourselves very evolved human beings. Out of ignorance people push aside Upanishads saying that these are very abstract, highly complex and difficult to understand Vedantic matters that would not have any relevance to day to day life. This is the reaction of a lazy mind which is afraid of going into deeper aspects for fear of losing the worldly pleasures. But the truth is, they are neither complex nor difficult to understand, but have a profound relevance to our daily life if sincerely pursued and understood. 

****

ఉపనిషత్తులు ప్రతిపాదించేది ఏమిటి?  

ఉపనిషత్తులు వేదం నందలి జ్ఞాన కాండ. ఇవి జీవితము యొక్క పరమార్ధం తెలుసుకునే సత్యాన్వేషణ మార్గాలు. పుట్టటం, మనుగడ సాగించటం, సంతానోత్పత్తి , వృద్దాప్యం మరియు మరణం ఇవేనా జీవితం అంటే? లేక వీటి వెనుక ఏదైనా పరమార్థం ఉందా?

వీటన్నిటికి మనకు ఉపనిషత్తులలో సమాధానాలు దొరుకుతాయి. వీటిని గురు-శిష్య సంవాద రూపంలో మనకు ఉపనిషత్తులు అందిస్తాయి. గురువు వద్దకు శిష్యుడు ఈ ప్రశ్నలతో వెళ్తాడు. గురువు అతనికి ఒక మార్గం చెప్పి సాధన చెయ్యమంటాడు. సాధన ద్వారా సమాధానం తెలుసుకోమంటాడు. శిష్యుడు సాధన చేసి తాను తెలుసుకున్న విషయం గురువుకు చెప్పి, తాను అంతే తెలుసుకున్నానని, పూర్తిగా తెలియదని చెపుతాడు. గురువు కొంత ఉపదేశించి మళ్ళీ సాధన చెయ్యమంటాడు.ఈ ప్రక్రియ ఈ విధంగా సాగి చివరకు సమాధానం తెలుసుకుంటారు.

మనమంతా కూడా ఈ మౌలికమైన ప్రశ్నలు వేసుకుని సమాధానం తెలుసుకోవాలి. కాని మనలో చాలామంది, ఇది ఎదో ' బ్రహ్మ విద్య' , చాల కష్టం, మన బోంట్లకు అర్థం కాదు, తెలుసుకుంటే మనకు ఏమి ఉపయోగం,  అని వీటి జోలికి వెళ్లరు. నిజానికి ఇవి ఒక బద్ధకపు మనసు ఆలోచనలు. ఇవి తెలుసుకుంటే మనం ఎక్కడ మన దైనందిన సుఖాలు పోగొట్టుకోవాల్సి వస్తుందేమో నన్న భయం. అలా భయపడవలసిన పని లేదు. ఉపనిషత్తులకు మన సుఖాలను లాగేసుకోవాలనే లక్ష్యం ఏమాత్రం లేదు. కనుక ఉపనిషత్తులను ఆశక్తితో, గట్టి జిజ్ఞాసతో చదివితే చక్కగా అవగతం అవుతాయి. అంతేకాక మన నిత్య జీవితాన్ని చక్కగా తీర్చి దిద్దే మార్గాలు మనకు తెలుస్తాయి. భగవంతుడు మనకు ప్రసాదించిన జీవితం యొక్క ఉన్నత లక్ష్యాలు మనకు గోచరమౌతాయి. 

కనుక శ్రద్దగా వీటిని తెలుసుకుందామా?

***


No comments:

Post a Comment