This Sloka lays emphasis on the importance of seeking out the inner Self. This would be the first step towards realising the Supreme Being.
" అసుర్యా నామతే లోకా ఆంధేన తమసావృతాః
తాగమ్ స్తే ప్రేత్యాభిగచ్ఛన్తి యేకే చాత్మహనో జనాః"
"There are demonic worlds enveloped in darkness to which the slayers of Self go after death"
This means there are some worlds which are enveloped in darkness to which those of demonic nature go. Here demonic means those who deny themselves the Inner Reality and believe that there is nothing more than the physical world that we see around and believe that to be real. These do not believe in the existence of Atma. So they are called 'slayers of Atma' . The sloka says these slayers of Atma keep wandering in the darkness of ignorance.
Though the Atma can not be slayed in the strictest sense, these by denying themselves the realisation of their Inner Self, are guilty of committing the sin of slaying their Self. Steeped in worldly pleasures, these are shutting the radiance of Inner Light. So the Rushi is saying 'please wake up and look; there is something beyond the physical body'
I will conclude by by quoting the saying of Sri Ramana Maharshi "deham naham koham soham" which is very relevant for us to understand and put into practice. Let's see the meaning : deham - 'this body'; naham - 'Iam not'; koham - 'who am I?' ; soham - 'the Supreme Being'
To summarise, "I am not this body. Then who am I? I am the Supreme Being"
***
తెనుగు సేత:
ఈ మూడవ శ్లోకం లో ఋషి ఆత్మవిచారణ యొక్క ప్రాధాన్యత తెలియబరుస్తున్నాడు. ఆత్మ విచారణే పరంధామం చేరే మొదటి మెట్టు.
"రాక్షసుల యొక్క లోకాలు అంధకారంతో ఆవరింప బడి ఉన్నాయి. ఆత్మ హంతకులు మరణానంతరం ఆ లోకాలను పొందుతారు"
ఈ శ్లోకం యొక్క వివరణ చూద్దాం:
రాగ ద్వేషాలకు లోనై, శరీరంతోనూ, మనసుతోనూ మనలను బంధించుకుని లోకంలోని సుఖభోగాల వేటలోనే జీవితం గడుపుతూ పోతే, మనం జనన మరణ చంక్రమణం లో తిరుగుతునే ఉంటాము. అందుకు మారుగా, అంతరంగిక పురోగతి పైన దృష్తి ఉంచి, ఆత్మ విచారణ వైపు శ్రద్ధ వహిస్తే, భగవత్ స్థితిని పొంది జీవన్ముక్తులు కాగలుగుతాం.
అలా కాకుండా, ఆత్మ చింతన చేయకుండా శరీరమే సర్వస్వం అనుకుని గడిపే వారిని ఋషి 'ఆత్మ హంతకులుగా' పేర్కొంటున్నాడు. ఆత్మ కు నాశనం లేదు కాబట్టి, దానిని నశింప చేయడానికి సరి సమానమైన నేరం చేసిన వారని అర్థం. అలాంటివారు మరణానంతరం అంధకార బంధురమైన లోకాలకు పోతారని ఈ మంత్రం చెపుతోంది. అంటే జన్మ పరంపరలకు చిక్కి దుఃఖంలో మునిగి వుంటారు.
కనుక దీనినుండి బయటపడాలంటే ఆంతరంగిక పురోగతిని కోరుకుని ఆత్మ విచారణ చేపట్టాలి.
ఇక్కడ భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పిన అద్భుతమైన వాక్యంతో ఈ శ్లోక వివరణను ముగించవచ్చు. అయన ఈ క్రింది వాక్యం తరుచుగా చెప్పేవారుట:
"దేహం నహం కోహం సోహం"
దీని అర్థం " నేను ఈ దేహం కాదు; మరి నేను ఎవరిని? నేను పరమాత్మనే!"
***
No comments:
Post a Comment