Friday, September 15, 2017

Ishavasyopanishad - Slokas 12-14 : ఈశావాశ్యోపనిషత్ - 12 నుండి 14 వ శ్లోకం వరకు! (సమాప్తం)


In the following 3 Shlokas, the Rishi is explaining the individual implications of worshipping physical or manifest forms (Saakara) of the Supreme Being, and also the implications of worshipping non-physical or unmanifest (Niraakara) form of the Supreme Being. He says the results of combining both the forms of worship will be totally different.

Shloka 12: 

"Into blinding darkness enter those who worship the unmanifest and into still greater darkness enter those who delight in the manifest"

Shloka 13: 

"Thus we have heard from the wise, the results that come from the worship of the manifest are different from the results of worshipping the unmanifest"

Shloka 14:

"He who understands the manifest and the unmanifest together, crosses death through worship of the manifest and becomes immortal through worship of the unmanifest" 

Explanatory Notes:

The Supreme Being, if given a physical form like Shiva, Vishnu, Durga, and is worshipped, it becomes manifest form of worship. With mind we think of certain attributes and give the deity a form. The other one is worship of the unmanifest. It means, we give no name, or form, or attribute to the Supreme Being as He is beyond grasp of the mind and intellect,but continue our worship. This is possible for those who have reached a certain higher level of consciousness. 

Those who worship the unmanifest without attaining corresponding spiritual maturity, get into self-deceit and hence the Rishi says, they enter the world of darkness. Similarly those who worship the manifest, but do not realise the supreme truth of all pervading nature of the Supreme Being and get into petty bickering that their God is superior to all others, enter into even darker worlds. 

The ancient sages have explained the results of both these forms of worship as capable of giving different results.

So the best results, the Rishi says, would come when one worships various physical forms with the deep consciousness that the underlying Supreme Being is one and only one. With this maturity if one continues his progress, he will reach a stage of understanding the subtleties of the worship of the unmanifest. 

He who reaches such a stage of maturity, crosses death (realises the permanence of the Soul) through worship of the manifest. Further he becomes immortal (gets released from the cycle of births and deaths) through worship of the unmanifest. 

With this we have completed the understanding of Ishavasyopanishad to the extent that is relevant for us. The remaining 3 Shlokas are not currently relevant for us and hence I am leaving them out from the current study.

***

తెనుగు సేత:

భగవంతుని సాకార రూపం లోనూ లేక నిరాకార రూపం లోనూ ఆరాధించవచ్చు. రెంటికీ వాటి వాటి ఫలితాలు ఉంటాయి. కానీ రెంటిని కలిపి ఆచరిస్తే ఉన్నతమైన ఫలితం కలుగుతుందని ఋషి ఈ క్రింది మూడు శ్లోకాలలోనూ వివరిస్తున్నాడు. 

12 వ శ్లోకం: 

"భగవంతుని నిరాకారునిగా ఉపాసించేవారు కటిక చీకటిలో మునిగిపోతారు. సాకార భగవంతుని ఉపాసించేవారు అంతకన్నా ఘాడాంధకారంలో ప్రవేశిస్తారు."

13 వ శ్లోకం:

"సాకార ఆరాధన వలన లభించేది ఒక రకమైన ఫలితం. నిరాకార ఉపాసన వలన లభించేది వేరొక ఫలితం అని చెపుతున్నారు మన పూర్వీకులైన మహాత్ములు"

14 వ శ్లోకం: 

"సాకార ఉపాసన, నిరాకార ఉపాసన రెండిటిని సమగ్రంగా మేళవించి గ్రహించినవాడు సాకారోపాసన వలన మరణాన్ని అతిక్రమించి, నిరాకారోపాసన వలన అమరత్వ స్థితికి చేరుకుంటాడు" 

వివరణ:

మనం ముందు చెప్పుకున్న 9 -11 మంత్రాలూ కర్మలు మరియు ధ్యానం యొక్క సమ్మేళనం యొక్క ప్రాముఖ్యాన్ని బలపరిచినట్లు ఈ మూడు మంత్రాలు రెండు విధాల ఉపాసనల సమ్మేళనాన్ని చెపుతున్నాయి

భగవంతుడు పలు రూపాలలో కనిపించేది సాకార స్థితి. ఎలాంటి రూపము, గుణము లేనిది నిరాకార స్థితి. ఈ రెండు స్థితులలోనూ మనం భగవంతుని ఉపాసించవచ్చు. మొదటిది సాకారోపాసన. రూప నామలుగల ఒక స్వరూపంగా ఆయనను దర్శించటమే ఈ భావన. శివుడు, విష్ణువు, అమ్మవారు అంటూ మనం కొలిచేది ఈ కోవకే చెందుతుంది. 

రెండవది నిరాకారోపాసన. రూపనామాలకు, గుణగణాలకు అతీతమైన స్థితిలో భగవంతుని ఆరాదించటం ఈ కోవకి చెందుతుంది. ఇది మనసుకు అందని స్థితి కాబట్టీ, ఉపాసనలో ఉన్నత స్థితి లోని వారికి మాత్రమే ఇది సాధ్యపడుతుంది. అర్హత లేకుండా ఈ ఉపాసనలో ఉన్నవారు ఆత్మవంచన చేసుకుంటారు. అందుకే వారు కటిక చీకిటిలో మునిగిపోతారు అని ఋషి వాక్కు.

అలాగే సాకారోపాసన లో ఉన్నవారు శివుడు, విష్ణువు మొదలైన పలు రూపాలు ఒకే బ్రహ్మ పదార్ధం యొక్క అనేక రూపాలు అనే సత్యాన్ని ఎరిగిన వారై ఉండాలి. అలా కాకుండా దేవతల మధ్య భేద భావంతో ప్రవర్తించేవాడు ఇలాంటి ఉపాసనతో ఏ సత్ఫలితాన్ని పొందలేడు. కనుక అట్టివారు మరింత ఘాడాంధకారంలో మ్రగ్గుతారని ఋషి వాక్కు. 

కనుక మొదట మన స్వభావానికి తగిన రూపంలో భగవంతుని ఆరాధించాలి. విభిన్న దేవతా మూర్తులను కొలిచినా, వారంతా ఒకే భగవంతుని పలు రూపాలు అనే నిరంతర స్పృహ లో ఉండాలి. సాకార స్థితిలోనే కాకుండా అదే నమ్మకంతో నిరాకార ఉపాసనను కూడా అంగీకరించాలి. అపుడు మనం ఆధ్యాత్మిక పధంలో పురోగమిస్తాము. భగవత్ సాక్క్షాత్కారం పొందుతాము. మరణానికి హేతువైన కర్మ ఫలాలనుండి విడివడతాము. 

ఈ అనుభూతి పర్యవసానం గురించి సంత్ తులసీ దాస్ చక్కగా వివరించారు. "భగవంతుని ముఖాముఖి దర్శించటం వలన ఒనగూరే సాటిలేని ఫలితం ఏమిటో తెలుసా?  మనిషి తన స్వస్వరూపమైన ఆత్మస్థితిలో నెలకొంటాడు." ఆ తరువాతే ఆయనను నిరాకార స్థితిలో ఆరాధించటానికి అర్హతను అయన కటాక్షం వలన పొందుతాడు. అలాంటి అర్హత లభించినప్పుడు ఉన్నతమైన ఆరాధన ద్వారా అమరత్వ స్థితిని పొందుతాడు. 

మంగళం మహాత్!

దీనితో ఈశావాస్యోపనిషత్ మనకు సంబంధించిన వరకు పరిపూర్నమైనదని చెప్పుకోవచ్చు. దీని తదుపరి 3 శ్లోకాలు ప్రస్తుతం మనకు సంబంధించనివి. కనుక వాటి వివరణ ఇవ్వటం లేదు. 

***









No comments:

Post a Comment