This Sloka seeks to explain the nature of Atma.
" అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా అప్నువన్ పూర్వమర్షత్
తద్దావతో న్యానత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిశ్వా దధాతి"
Let's see what the Rishi is saying through this mantra:
"It is One. It is that which doesn't move. But It is faster and swifter than the mind. There is no way the Senses can ever grasp It. By Itself It stands still; but It outruns those who run to reach for It. Because It is there, It makes the life energy - prana, support the activities of all beings"
Let's see the import of this statement part by part:
For anything to move or to work, there should be space. But the Atma is all pervading and hence has no space to move. That's why It has no motion.
Our mind is so fast and goes wherever we want it to go in a fraction of a second. But by the time it reaches there, Atma or the Supreme Being would already be there. Though It stands still, It can outpace anything that tries to grasp It.
The sensory organs can not grasp It. These sensory organs have been designed to carry only the information pertaining to the physical world. So they have no power of inward looking or grasp the inner secrets or the inner Self.
For something to move about, it needs a pivot or a base from which it moves. For example, a train needs tracks to run. In the physical world, everything moves due to the flow of life energy or prana. The Atma is the stationary base which helps prana to move about and carry out its activities.
****
తెనుగు సేత:
ఈ శ్లోకంలో ఋషి ఆత్మ యొక్క స్వరూపం లేక నైజం గురించి వివరిస్తున్నాడు.
"ఆత్మ చలనం లేనిది. అది ఒకటే అయినది. మనసు కంటే వేగమైనది. ఇంద్రియాలు దానిని పొందలేవు. అది స్థిరంగా ఉన్నప్పటికీ అన్నిటికన్నా ముందు వెళుతుంది. చలించే వస్తువులన్నిటి కన్నా వేగవంతమైనది. అది స్థిరంగా ఉండటంవలన ప్రాణం అన్నిటినీ పని చేయిస్తుంది"
ఇక వివరణ చూద్దాం:
ఒక వస్తువు చలించాలంటే దానికి ఒక చోటు ఉండాలి. ఎందుకంటే చలించటమంటే ఒక చోటు నుండి ఇంకొక చోటుకు వెళ్ళటం. మరి ఆత్మ సర్వత్ర వ్యాపించి ఉన్నప్పుడు, దానికి చలనం ఎలా సాధ్యం?
మనసు అతి వేగమంతమైనది. మనం ఎక్కడికి కోరుకుంటే అక్కడికి మన మనసు త్రుటిలో చేరుతుంది. కానీ విశేషం ఏమిటంటే, అది అక్కడకు చేరటానికి ముందే అక్కడ ఆత్మ నెలకొని ఉంటుంది. కనుక ఆత్మ మనసు కంటేను, మరి ఏ ఇతర వేగవంతమైన వస్తువు కంటే కూడా అతి వేగవంతమైనది.
ఇంద్రియాల ద్వారా ఆత్మను తెలుసుకోలేము. ఎందుకంటే అవి బాహ్య పదార్ధాలను, భౌతిక ప్రపంచాన్ని తెలుసుకోవటం కోసమే నియమితమైనాయి. అవి అంతరంగిక సత్యాలను, ఆత్మ విచారణ చేయలేవు.
ఏదైనా చలించాలంటే దానికి ఆధారభూతమైనది ఒకటి కావాలి. ఉదాహరణకి, రైలు పరిగెట్టాలంటే, దానికి రైలు పట్టాలు కావాలి. ఈ లోకంలో అన్ని చలనాలకు కారణ భూతమైనది ప్రాణం. చలించే ప్రాణానికి ఆధారభూతమైనది చలించని ఆత్మే!
***
No comments:
Post a Comment