"ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్నాత్పూర్ణ ముదచ్యతే
పూర్ణస్య పూర్నమాదాయ పూర్నమేవావ శిష్యతే"
ఓం శాంతి శాంతి శాంతి
ఇది మనం తరుచు వింటూ వుంటాం, కానీ అది ఎక్కడది, దాని అర్థం ఏమిటన్నది చాల మంది కి తెలియకపోవచ్చును.
ఇది ఒక శాంతి మంత్రం. ఇది ఈశావాస్యోపనిషత్ ముందు ఉండే శాంతి మంత్రం. మన ఋషులు ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సత్యాన్ని ఈ చిన్ని మంత్రం లో నిక్షిప్తం చేసారు. అదేమిటో చూద్దాం.
"అది పూర్ణం, ఇది పూర్ణం; ఆ పూర్ణం లోంచి ఈ పూర్ణం ఉదయించింది. అ పూర్ణం లోంచి ఈ పూర్ణం తీసివేసినా పూర్నమే మిగిలి ఉంటుంది"
ఇప్పుడు విశేషార్థం తెలుసుకుందాం. అ పూర్ణం అనగా పరబ్రహ్మం. ఈ పూర్ణం అనగా జీవ బ్రహ్మం (జీవుడు). ఆ పరబ్రహ్మం లోంచే ఈ జీవ బ్రహ్మం ఉదయించింది. లయకాలం లో ఆ పరబ్రహ్మం లోకి ఈ జీవ బ్రహ్మం లీనమైనప్పుడు కూడా పరిపూర్ణమైన పరబ్రహ్మం మిగిలి ఉంటుంది.
గణితం ప్రకారం ఆలోచించినా : సున్నా కి సున్నా కలిపినా సున్నా ; సున్ననుండి సున్నా తీసివేసినా సున్నయే మిగులుతుంది. ఇదే అద్వైతం. అతడే ఇతడు; సోహం . జీవాత్మా పరమాత్మా ఒక్కరే.
చూసారా మన ఋషుల యొక్క అసమానమైన జ్ఞాన శక్తి.
****
The above is the shanthi mantra appearing at the beginning of Ishavasopanishad. The mantra though apparently looking simple, contains deeper spiritual meaning.
It means : "This is complete, that is complete; from that completeness comes this completeness; if you take away this completeness from that completeness, that completeness remains"
That completeness = The Supreme Reality
This completeness = our consciousness
our consciousness is born out of the Supreme Reality
If you take away our consciousness from the Supreme Reality, still we get the complete Supreme reality.
So at the end of the Yuga, when the individual consciousness melts into the Supreme Reality, the Supreme Reality remains as a complete reminder.
This is Advaita put in a small Mantra. The Jeeevatma and Paramaatma are one and the same. The jeevatma comes out of the Paramaatma and when the time comes merges into Parmatma and the Paramatma remains eternal.
i like this santhi manthra so much and i recite it every day for past several years. this manthra can be a guidance for modern scientists.
ReplyDelete