This is the second Sloka which propounds that if one lives a life realising that everything here belongs to Him (as explained in the first sloka), he will escape the karmik bondage. Let's see the meaning of this sloka:
"కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చతగం సమాః
ఏవం త్వయి నాన్య ధేతో స్తిన కర్మ లిప్యతే నరే"
"one can live a hundred years performing the laid down karmas (as that is the only way for you) and not be effected by the results of the karmas"
The meaning is that, it is not possible for us to live on the Earth without performing day to day Karmas or actions. These would be necessary for our survival. As per the law of karma, the good or bad results of such karmas bind the person and put him into the cycle of births and deaths. But what the Rishi says here is that, if such karmas are performed without attachment and fully realising that He is there in everything and that He is the witness of all the karmas or actions, one will not be bound by such karmas even if he performs them for a hundred years.
-Om shanthi shanthi shanthi-
తెనుగు సేత:
" కర్తవ్యాలను, విహిత కర్మలను చేస్తూ మాత్రమే నూరు సంవత్సరాలు జీవించాలని ఆశించు. నీ లాంటి వారికి అది తప్ప మార్గం లేదు. అలా జీవించటం వలన కర్మలు నిన్ను అంటవు"
ఇప్పుడు ఈ మంత్రం లో ఋషి చెప్పదలచుకున్నభావం ఏమిటో చూద్దాం.
లోకం లో జీవించాలి; తప్పదు. అందుకోసం పని చేసి తీరాలి. కర్మలను చేయకుండా ఎవరూ జీవించలేరు. ఏ పని చేసినా అందుకు ఫలితం ఉంటుంది. అది మంచి కావచ్చు లేక చెడు కావొచ్చు. రెండూ కలసినది గా కూడా ఉండవచ్చు. ఆ ఫలితం ఏదైనప్పటికీ అది మనలను బంధిస్తుంది. ఇలా కర్మలు కొన సాగుతాయి. ఇది జనన మరణ పరంపరలకు దారి తీస్తుంది.
కానీ ఈ లోకం భగవంతునికి చెందినదిగా గ్రహించి అయన ఇచ్చిన ఐశ్వర్యానికి, సుఖానికి భాద్యత వహించిన వ్యక్తిగా జీవితం గడిపితే , ఆ భావంతో పని చేస్తే , అ కర్మ వలన వచ్చే ఫలం ఎదైనాసరే మనలను అంటదు (విహితమైన కర్మలు అని చెప్పేము కనుక, ధర్మ పరమైన పనులే అని అర్థం, అంతే కాని చెడు పనులు, పాప కార్యాలు కూడా చెయ్యొచ్చు,అని దయచేసి అర్థం తీసుకోవద్దు). ఫలితం మనలను అంటనందున అది మన ఆధ్యాత్మ పురోగతికి దోహదం చేస్తుంది. అపుడు మనం ఆత్మ సాధనలో ఒక ముఖ్యమైన మెట్టు ఎక్కినట్లే!
ఓం శాంతి శాంతి శాంతి!
No comments:
Post a Comment