మనం(జీవి), మనం జీవించే లోకం (జగత్తు), ఈ రెండిటికీ కారణభూతమైన భగవంతుడు - ఈ మూడూ మౌలిక సత్యాలు. ఈ మూడూ నిజానికి ఏమిటి, వీటికి మధ్య నెలకొన్న సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలు అనాదిగా తత్త్వ వేత్తలను ప్రేరిపిస్తూ వస్తున్నాయి. మన ఉపనిషత్కాలపు ఋషులు ఈ మూల సత్యాలను చక్కగా విచారణ చేసి చక్కని సమాధానాలను పొందగలిగేరు. అవి ఏమిటో మన పరిదిలో మనం చూద్దాం.
లోకం:
లోకం అంటే ఎదో శూన్యం నుంచి ఒక్కసారిగా సృస్థించబడింది కాదు. కారణం లేకుండా ఏ కార్యమూ జరుగదు. శూన్యం నుండి దేనిని సృస్థించలేము. ఆ విధంగా, ఉన్న దేనినీ లేకుండా చేయడం సాధ్యం కాదు. అది అత్యంత సూక్షం గా మారవచ్చు. మళ్ళీ స్థూల వస్తువు గా మార్పు చెందవచ్చు. బీజం నుండి చెట్టు, చెట్టునుండి బీజం ఇలా పునరావ్రతం అవుతాయి. ఇదేవిధంగా జంతువులు, మానవులు కూడా. స్థూలం నుండి సూక్ష్మం ...మళ్ళీ సూక్షం నుండిస్తూలం; ఇలా చంక్రమణం సాగుతూ ఉంటుంది.
దీనిని బట్టి చూస్తే, ఈ లోకానికి ఆద్యంతాలు లేవని తెలుస్తోంది. సృష్టి ఆద్యంతరహితమైనదని వేదాలు చెపుతున్నాయి. కనుక సృష్టి లేనటువంటి కాలం ఎప్పుడూ లేదని తేలుతోంది. కొన్ని సమయాలలో లోకం నిష్క్రియ స్థితిలోనూ, కొన్ని సమయాలలో క్రియాజనిత స్థితిలోనూ ఉంటుంది. అంటే లయం నుండి ఆవిర్భావం, ఆవిర్భావం నుండి లయం కొనసాగుతూ ఉంటాయి.
మనిషి:
ఇక మనిషి ఎవరన్న ప్రశ్నకు మన ఉపనిషత్తులు నుండి రెండు ముఖ్యమైన సమాధానాలు లభిస్తున్నాయి. వాటిలో ఒక సమాధానాన్ని మాండూక్యోపనిషత్తు చెపుతుంది. మనిషి లో నాలుగు పరిమాణాలు నిండి ఉంటాయి అంటుంది ఈ ఉపనిషత్తు.
జాగ్రద్, స్వప్న, సుషుప్తి అనే మూడు స్థితులలో మనం మార్చిమార్చి సంచరిస్తూవుంటాము. వీటిలో మనం విభిన్నమైన అనుభవాలను పొందుతాము.ఇన్ని పరిమాణాలు అతడికి ఉన్నప్పటికీ అతడు ఎవరు అంటే ఇన్ని పరిమాణాలను తనలో ఇముడ్చుకున్న ఒక మనిషి.
మనం ఈ మూడు స్థితులలోనూ లోకంతో సంబంధం కలిగి ఉంటాము. ఈ మూడు అవస్థలను ఇముడ్చుకున్న మొత్తం పరిణామమే ఆత్మ. ఇది నాలుగవ పరిమాణం అని చెప్పబడుతోంది.
భగవంతుడు:
భగవంతుడు అనే పదానికి అత్యున్నత స్థితి వివరణను మాండూక్యోపనిషత్తు ఇస్తోంది. భగవంతుడు ఎవరు అనే దానికి 'ఆత్మే భగవంతుడు' అనే మహావాక్యాన్ని 'అయమాత్మా బ్రహ్మ' అని చెప్పింది.భగవంతుడు సర్వవ్యాపి కనుక అయన మనలోనూ కొలువై ఉన్నాడు. మన హృదయం లో ప్రకాశించే స్థితిలో ఆయన ఆత్మ గా పేరుగాంచాడు. ఓంకారం అనే ప్రణవనాదాన్ని భగవంతునికి ప్రతీకగా మాండూక్యోపనిషత్తు నెలకొల్పుతోంది.
సమస్తమూ ఒకటే!
భగవుంతుడిని ఓంకారం గా చెప్పినప్పుడు, అయన సర్వవ్యాపి కనుక లోకం కూడా ఓంకారంలోనే ఇమిడి వుంది. మనిషి లోకంలోని వాడు కనుక, మనిషి కూడ ఓంకారం లో ఉన్నట్లే. అలాగే ఆత్మ స్థితిలో మనిషి, భగవంతుడు ఒకటే అని చెప్పుకున్నాము కనుక మనిషి = భగవంతుడు. . అవన్నీ పరిశీలించిన పిదప, లోకమూ, మనమూ, భగవంతుడు వేరు కాదన్న విశిస్థమైన అభిప్రాయం మాండూక్యోపనిషత్తు ప్రతిపాదిస్తుంది. అనగా లోకం = మనిషి = భగవంతుడు.
****
No comments:
Post a Comment